News August 31, 2025
IPL: ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త కెప్టెన్?

ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ వచ్చే సీజన్‌కు కొత్త కెప్టెన్‌ను నియమించనున్నట్లు వార్తలొస్తున్నాయి. గత సీజన్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన అక్షర్ పటేల్‌ను కేవలం ఆటగాడిగా కొనసాగించనున్నట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వార్నర్, KL రాహుల్ వంటి ప్లేయర్లు కెప్టెన్సీ రేసులో ఉన్నట్లు సమాచారం. గత సీజన్‌లో DC పాయింట్స్ టేబుల్‌లో ఐదో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.
Similar News
News February 11, 2026
స్పీకర్‌పై ‘అవిశ్వాసం’.. ఇప్పుడేం జరుగుతుంది?

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస <<19101605>>తీర్మానానికి<<>> ప్రతిపక్షాలు నోటీసులివ్వడం తెలిసిందే. ముందుగా తీర్మానంలో వాడిన భాషను డిప్యూటీ స్పీకర్/ప్యానల్ ఛైర్ పర్సన్ పరిశీలిస్తారు. 14 రోజుల తర్వాత సభ పరిశీలనకు తీర్మానం వస్తుంది. ఈ సమయంలో సభకు స్పీకర్ నేతృత్వం వహించరు. తనపై మోపిన అభియోగాలపై మాట్లాడేందుకు, తన చర్యలను సమర్థించుకునేందుకు స్పీకర్‌కు అవకాశం ఉంటుంది. 10 రోజుల్లోగా లోక్‌సభలో చర్చించి తేల్చాల్సి ఉంటుంది.
News February 11, 2026
మొదలైన పోలింగ్

TG: రాష్ట్రంలో 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో పోలింగ్ మొదలైంది. సా.5 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం 8,191 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 52 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.
News February 11, 2026
ఇవాళ వారికి వేతనంతో కూడిన సెలవు

TG: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కార్మిక శాఖ వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని ఫ్యాక్టరీలు, షాపులు, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆఫీసులు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ఇప్పటికే సెలవు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులకు ‘స్పెషల్ క్యాజువల్ లీవ్’ సైతం మంజూరు చేసింది.


