News August 31, 2025
పూర్తి నీరు నిల్వ చేసినందుకే మేడిగడ్డ కూలింది: ఉత్తమ్

TG: KCR అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని మంత్రి ఉత్తమ్ అసెంబ్లీలో విమర్శించారు. ‘డ్యామ్‌కు, బ్యారేజీకి తేడా లేకుండా పనులు చేశారని NDSA నివేదికలో ఉంది. మేడిగడ్డలో పూర్తి నీరు నిల్వ చేసి కూలిపోయేందుకు కారణమయ్యారు. పూర్ ప్లానింగ్, డిజైన్ వల్లే అది కూలిందని NDSF తేల్చి చెప్పారు. మీరే డిజైన్ చేశారు. మీరే కట్టారు. మీ హయాంలోనే కూలింది. ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్’ అని ఫైరయ్యారు.
Similar News
News September 4, 2025
అర్మానీ.. ‘Its a Brand’ 1/2

మనలో చాలామందికి సుపరిచితమైన ‘అర్మానీ’ దుస్తుల బ్రాండ్ ఓనర్ జార్జియో అర్మానీ(91) <<17614096>>కన్నుమూశారు<<>>. ఇటలీలో 1975లో అర్మానీ, ఆయన పార్ట్‌నర్ సెర్జియో గలాటీ మెన్స్‌వేర్ దుకాణాన్ని తెరిచారు. అందుకు తమ వద్దనున్న పాత వోక్స్‌వ్యాగన్ కారును అమ్మేశారు. వ్యాపారం బాగా నడవడంతో తర్వాత ఏడాదికి మహిళల దుస్తులనూ విక్రయించడం ప్రారంభించారు. ఆ తర్వాత వారి వ్యాపార సామ్రాజ్యం సరిహద్దులు దాటింది. ఖండాంతరాలకు విస్తరించింది.
News September 4, 2025
అర్మానీ.. ‘Its a Brand’ 2/2

అర్మానీ కంపెనీ కేవలం దుస్తులకే పరిమితం కాకుండా యాక్సెసరీస్‌లు, హోమ్ ఫర్నిషింగ్స్, పెర్‌ఫ్యూమ్స్, కాస్మెటిక్స్, బుక్స్, ఫ్లవర్స్, చాకోలెట్స్ తదితర విక్రయాల్లోనూ తన బ్రాండ్ పవర్ చూపించింది. జార్జియో అర్మానీకి సొంత బాస్కెట్‌బాల్ టీమ్‌తో పాటు పలు దేశాల్లో బార్లు, క్లబ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లు కూడా ఉన్నాయి. ఫోర్బ్స్ ప్రకారం ఆయన సంపద 10 బిలియన్ డాలర్లు.
News September 4, 2025
ఆ కోర్సుల్లో దృష్టి లోపం గల దివ్యాంగులకు అనుమతి: విద్యాశాఖ

AP: మంత్రి లోకేశ్ చొరవతో దృష్టిలోపం ఉన్న దివ్యాంగులకు MPC, బైపీసీ కోర్సులు చదవడానికి అనుమతి లభించింది. ఈ మేరకు కళాశాల విద్యాశాఖ GO జారీ చేసింది. సైన్స్ కోర్సుల్లో తమకు అవకాశం కల్పించాలన్న దివ్యాంగుల విజ్ఞప్తికి స్పందించిన లోకేశ్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రాక్టికల్స్ పరీక్షలకు ఆ విద్యార్థులు హాజరవ్వడం కష్టమని అధికారులు తెలపగా, బదులుగా లఘురూప ప్రశ్నలతో ఎసెస్‌మెంట్ చేయాలని మంత్రి సూచించారు.