News August 31, 2025
HYD: చిట్టి గణపయ్యకు చిన్న జీపు

వినాయకచవితి నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు నగరంలో నిమజ్జనాల ఊరేగింపులు ఉత్సాహంగా జరుగుతున్నాయి. పాతబస్తీ మాదన్నపేటలో ఓ చిన్నారి చిట్టి గణపయ్య కోసం చిన్న జీపును సిద్ధం చేసింది. గణపయ్యను ఆ వాహనం మీద ఊరేగింపు చేస్తూ నిమజ్జనం చేశారు. ఈ దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకొంది.
Similar News
News September 3, 2025
నాంపల్లి: ఎలాంటి ఆర్భాటాలు లేకుండా గౌరిపుత్రుడి నిమజ్జనం

బజార్‌ఘాట్‌లోని బంగారు ముత్యాలమ్మ ఆలయం ముందు ఏర్పాటు చేసిన 18 అడుగుల గణేశుడు తళుక్కున మెరిసిపోతున్నాడు. ఈ లంబోదరుడిని ప్రత్యేకంగా స్టోన్స్(వజ్రాల)తో అలంకరించారు. 50 ఏళ్లుగా ప్రతిష్ఠిస్తున్న ఈ గణనాథుడిని ఈసారి మొయినాబాద్‌లో తయారు చేయించారు. చవితి రోజున ప్రారంభమైన అన్నదానం శనివారం వరకు సాగనుంది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా అదేరోజు ఈ గౌరిపుత్రుడిని నిమజ్జనం చేయనున్నట్లు మండప నిర్వాహకులు తెలిపారు.
News September 3, 2025
HYD: హ్యాపీ దీపావళి పింకీస్: రామ్మోహన్ రెడ్డి

BRS ముఖ్యనేతలు హరీశ్ రావు, సంతోశ్‌రావులపై కవిత తీవ్ర విమర్శలు చేయడంపై TPCC అధికారిక ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి X వేదికగా స్పందించారు. ‘KCRకు వెన్నుపోటు పొడుస్తుంది.. హరీశ్, సంతోష్ రావులేనని కవిత చెప్పింది. వీరిద్దరు తెలంగాణకు చేసిన ద్రోహాన్ని భవిష్యత్తులో ఎపిసోడ్‌లుగా కవితక్క బయటపెట్టనున్నారు. ఇకపై కవితక్క పేలుస్తుంది చూడండి లక్ష్మీ బాంబులు. హ్యాపీ దీపావళి పింకీస్’ అని ట్వీట్ చేశారు.
News September 3, 2025
HYD: ఈ ATMతో క్షణాల్లో రక్త, వైద్య పరీక్షలు

60 రకాల వైద్యపరీక్షలు చేసి రిపోర్ట్ ఇచ్చే ATMను ఢిల్లీకి చెందిన క్లినిక్స్ ఆన్ క్లౌడ్ అంకుర సంస్థ రూపొందించింది. పైలెట్ ప్రాజెక్టుగా కింగ్ కోఠిలోని జిల్లా ఆస్పత్రి, మలక్‌పేట ఏరియా ఆస్పత్రిలో ATMలను ఏర్పాటు చేసింది. ఈ ATMలో అనేక రోగ నిర్ధారణ పరీక్షలు చేయవచ్చని, ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో రోగులకు ATMపై పరీక్షలు చేస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇది సక్సెస్ అయితే మరిన్ని ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయనున్నారు.