News August 31, 2025
రూ.21వేల కోట్లతో కట్టిన 3 బ్యారేజీలు వృథా: మంత్రి

TG: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీరు నిల్వ చేయకున్నా పంటలకు నీరిచ్చామని మంత్రి ఉత్తమ్ అసెంబ్లీలో చెప్పారు. కాళేశ్వరం కూలిన తర్వాత ధాన్యం ఉత్పత్తిలో నం.1 అయ్యామన్నారు. కాళేశ్వరానికి రూ.87,449 కోట్లు ఖర్చు చేస్తే, రూ.21వేల కోట్లతో కట్టిన 3 బ్యారేజీలు పూర్తిగా నిరుపయోగంగా మారాయని విమర్శించారు. తాము ఎక్కడా కక్ష సాధింపు ధోరణితో వెళ్లలేదని, పారదర్శకంగా విచారణ చేయించామని చెప్పారు.
Similar News
News September 3, 2025
కవిత ప్రశ్న.. సమాధానం ఎక్కడ..?

ఇవాళ ప్రెస్‌మీట్‌లో అనేక ఆరోపణలు, అంశాలు ప్రస్తావించిన కవిత ఓ ప్రశ్న కూడా సంధించారు. అది అందర్నీ ఆలోచనలో పడేసింది. ‘నా ఫ్లెక్సీలు, దిష్టిబొమ్మలు తగులబెట్టిన BRS కార్యకర్తలు KCRపై CBI దర్యాప్తు చేయిస్తామని రేవంత్ అంటే ఎందుకు నిరసన తెలపలేదు’ అని ప్రశ్నించారు. ఉద్యమ పార్టీ BRSకి ఎన్నో నిరసనలు, ఆందోళనలు చేసిన చరిత్ర ఉంది. ఆ పార్టీ ఇప్పుడు ఎందుకు సరిగా స్పందించలేదని ప్రజలూ సమాధానం కోసం చూస్తున్నారు.
News September 3, 2025
ప్రపంచ నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా రజా

ఐసీసీ వన్డే ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో జింబాబ్వే క్రికెటర్ సికిందర్ రజా అగ్రస్థానంలో నిలిచారు. 302 పాయింట్లతో ఆయన టాప్ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. టాప్-5లో ఒమర్జాయ్, మహ్మద్ నబీ, మెహిదీ హసన్, బ్రేస్‌వెల్ ఉన్నారు. భారత్ నుంచి టాప్-10లో రవీంద్ర జడేజా(9) ఒక్కరే ఉన్నారు. బ్యాటర్ల జాబితాలో గిల్, రోహిత్ టాప్-2లో ఉన్నారు. అలాగే బౌలింగ్ విభాగంలో కేశవ్ మహరాజ్(సౌతాఫ్రికా) అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
News September 3, 2025
రేవంత్, హరీశ్ కుమ్మక్కయ్యారని ముందే చెప్పా: రఘునందన్

TG: రేవంత్, హరీశ్ కుమ్మక్కయ్యారని తాను గతంలోనే చెప్పానని BJP ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కవిత కొత్తగా చెప్పిందేమీ లేదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎపిసోడ్‌లో BRS బడా నేతల అవినీతి బయటపెడితే బాగుంటుందన్నారు. మరోవైపు KCRకు కుమార్తె, కుమారుడు ముఖ్యం కాదని, పార్టీయే ముఖ్యమని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కవిత అంశంపై స్పందిస్తూ దేశవ్యాప్తంగా ఇలాంటి సస్పెన్షన్లు ప్రతి పార్టీలో జరిగాయని గుర్తుచేశారు.