News August 31, 2025

దివ్యాంగులకు యథావిధిగా పెన్షన్లు పంపిణీ: కలెక్టర్

image

సెప్టెంబర్ 1న జిల్లాలోని దివ్యాంగులకు పెన్షన్లు యథావిధిగా పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. జిల్లాలో మొత్తం 2,35,813 మందికి రూ.102.80 కోట్ల ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు ఆమె ఆదివారం వెల్లడించారు. జిల్లాలోని 33,117 దివ్యాంగుల పెన్షన్లలో కేవలం 33 మంది మినహా మిగిలిన వారందరికీ పెన్షన్లు అందజేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.

Similar News

News September 3, 2025

బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలి: కలెక్టర్

image

బ్యాంకు ఖాతాలతో పాటు బీమా, పెన్షన్ సౌకర్యాలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి సూచించారు. రాజమండ్రిలోని ఆనం కళా కేంద్రంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో స్వయం సహాయక బృందాల సభ్యులకు నిర్వహించిన ఆర్థిక చేరిక సంతృప్తి ప్రచారం సదస్సులో ఆమె మాట్లాడారు. పీఎం సురక్ష బీమా యోజన, పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.

News September 3, 2025

జిల్లాలో అవసరానికి తగిన యూరియా సరఫరా: కలెక్టర్

image

జిల్లాలో ఖరీఫ్-2025 సీజన్‌కు అవసరమైన ఎరువుల సరఫరా సమయానుకూలంగా సరఫరా చేస్తున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి మంగళవారం తెలిపారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్‌ వరకు జిల్లాకు అవసరమైన 26,000 మెట్రిక్ టన్నుల యూరియాలో ఇప్పటివరకు 22,000 మెట్రిక్ టన్నులు సరఫరా చేసినట్లు వివరించారు. దుకాణదారులు యూరియా, ఎరువులను అధిక ధరకు విక్రయించినా, ఇతర ప్రాంతాలకు తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News September 3, 2025

వార్డు సచివాలయాల పనితీరుపై పర్యవేక్షణ ఉండాలి: కలెక్టర్

image

వార్డు సచివాలయాల పనితీరును నోడల్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని కలెక్టర్, కమిషనర్ పి.ప్రశాంతి సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో నోడల్ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి పర్యటనల సమయంలో చెత్త సేకరణతో పాటు రోడ్లు, డ్రెయిన్లు, తాగునీటిపై వచ్చే సమస్యలపై దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా ఐవీఆర్ఎస్ కాల్స్‌లో వచ్చే ఫిర్యాదులపై స్పందించాలని పేర్కొన్నారు.