News August 31, 2025
కృష్ణా జిల్లా సాఫ్ట్ టెన్నిస్ జట్ల ఎంపికలు

కృష్ణాజిల్లా సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7న జిల్లా సీనియర్ పురుషుల, మహిళల జట్ల ఎంపికలు నిర్వహించనున్నారు. పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య నగర పాలక సంస్థ స్టేడియంలో ఉదయం 7 గంటలకు ఈ ఎంపికలు జరుగుతాయని అసోసియేషన్ కార్యదర్శి డి. దిలీప్ కుమార్ తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు తమ ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని ఆయన కోరారు.
Similar News
News September 3, 2025
కృష్ణా జిల్లా రైతులకు శుభవార్త

కృష్ణా జిల్లాలో ఎరువుల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మరో వారం పది రోజుల్లో 4 వేల మెట్రిక్ టన్నుల యూరియా గుజరాత్ నుంచి వస్తుందని అధికారులు తెలిపారు. బుధవారం 1,200 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. పకడ్బందీగా యూరియా సరఫరా చేసేందుకు అధికారులు సన్నద్ధం అయ్యారు. పాస్ బుక్ ఉన్న రైతులకు 25 కేజీల యూరియా సరఫరా చేయనున్నారు.
News September 3, 2025
కృష్ణా జిల్లాలో 73 ఎస్సీ గ్రామాలకు శ్మశానాలు లేవు

కృష్ణా జిల్లాలో 73 ఎస్సీ గ్రామాలకు శ్మశానవాటికలు లేవని ఎస్సీ సంక్షేమ శాఖ గుర్తించింది. ఈ మేరకు గుడివాడలో 15, మచిలీపట్నంలో 15, ఉయ్యూరులో 43 గ్రామాలకు మొత్తం 72.98 ఎకరాలు కేటాయించాలని కోరుతూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికను తాజాగా భూసేకరణ చీఫ్ కమిషనర్ (CCLA)కు అందజేసింది.
News September 3, 2025
పాపవినాశనం ఇసుక రీచ్‌పై ఈ-టెండర్లు

జిల్లాలోని ఘంటసాల మండలం పాపవినాశనం ఇసుక రీచ్ నుంచి ఇసుక తవ్వకాలకు నిబంధనల మేరకు ఈ-టెండర్లు పిలవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో జిల్లాలో ఇసుక నిల్వలపై సమీక్షించారు.