News August 31, 2025
నాకు ఇంకా ఎంగేజ్మెంట్ కాలేదు: నివేదా

తనకు ఇంకా నిశ్చితార్థం కాలేదని హీరోయిన్ నివేదా పేతురాజ్ క్లారిటీ ఇచ్చారు. ‘అక్టోబరులో ఎంగేజ్మెంట్, జనవరిలో పెళ్లి చేసుకోబోతున్నాం. డేట్స్ ఇంకా ఫైనల్ కాలేదు. రాజ్‌హిత్ ఇబ్రాన్‌ను ఐదేళ్ల క్రితం దుబాయ్‌లో కలిశాను. మంచి ఫ్రెండ్స్ అయ్యాం. పెళ్లెందుకు చేసుకోకూడదు అని పరస్పరం ప్రశ్నించుకున్నాం’ అని తెలిపారు. రాజ్‌హిత్‌కు దుబాయ్‌లో వ్యాపారాలు ఉన్నాయి.
Similar News
News September 3, 2025
చలాన్ కోసం కాదు.. రక్షణ కోసం హెల్మెట్ వాడండి: పోలీసులు

చాలామంది చలాన్ల నుంచి తప్పించుకునేందుకు నాణ్యతలేని హెల్మెట్లను వాడి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే రక్షణనిచ్చే నాణ్యమైన హెల్మెట్లను వాడాలని TG పోలీసులు వాహనదారులకు సూచిస్తున్నారు. ‘ISI మార్క్ ఉన్న హెల్మెట్ మాత్రమే వాడండి. నాసిరకం హెల్మెట్లతో రక్షణ ఉండదు. చలాన్ తప్పించుకునేందుకు కాకుండా రక్షణ కోసం మంచి హెల్మెట్ వాడండి. హెల్మెట్ మీ రక్షణ కవచమని గుర్తుంచుకోండి’ అని పేర్కొన్నారు.
News September 3, 2025
కవిత KCR విడిచిన బాణం కావొచ్చు: మహేశ్ గౌడ్

TG: అవినీతిపై ప్రజల దృష్టిని మళ్లించడానికి కేసీఆర్ విడిచిన బాణం <<17599925>>కవిత<<>> కావొచ్చని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఎద్దేవా చేశారు. కేటీఆర్‌పై కవిత స్టాండ్ ఎందుకు మారిందో అర్థం కావడం లేదన్నారు. బాణం హరీశ్ రావు వైపు ఎందుకు తిరిగిందో తెలియడం లేదని సెటైర్లు వేశారు. ఇవాళ కవిత కొన్ని సత్యాలు, అసత్యాలు మాట్లాడారని అన్నారు. ఆమెకు తెలియకుండానే బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందా అని ప్రశ్నించారు.
News September 3, 2025
లిక్కర్ స్కాం.. చెవిరెడ్డి ఇంట్లో సిట్ తనిఖీలు

AP: లిక్కర్ స్కాం కేసులో తిరుపతి సమీపంలోని తుమ్మలగుంటలో మాజీ MLA చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(ఏ38), చిత్తూరులోని YCP నేత విజయానందరెడ్డి ఇళ్లలో సిట్ తనిఖీలు చేస్తోంది. గత ఎన్నికల్లో చిత్తూరు MLA అభ్యర్థిగా పోటీ చేసిన విజయానందరెడ్డిని ఇటీవల విజయవాడకు పిలిపించిన సిట్ 2రోజులు ప్రశ్నించింది. ఆ సమయంలో చెప్పిన సమాధానాలు, ఆయన ఇంటి అడ్రస్సులో CBR ఇన్‌ఫ్రా కంపెనీ ఉండటంతో వాటి ఆధారంగా సోదాలు జరుగుతున్నాయి.