News August 31, 2025
‘ప్రాణహిత-చేవెళ్ల’తో రూ.60 వేల కోట్లు మిగిలేవి: మంత్రి ఉత్తమ్

TG: రూ.38,500 కోట్లతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కట్టి ఉంటే 16.50 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవని మంత్రి ఉత్తమ్ అసెంబ్లీలో అన్నారు. ‘ఆ ప్రాజెక్టుతో రూ.60వేల కోట్లు ఆదా అయ్యేవి. పాలమూరు-రంగారెడ్డి, నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి, దేవాదుల, సీతారాంసాగర్ ప్రాజెక్టులు పూర్తయ్యేవి. ఇప్పటివరకు కాళేశ్వరం నీటిని ఎత్తిపోసినందుకు ఇరిగేషన్ శాఖ విద్యుత్ శాఖకు రూ.9,738 కోట్లు చెల్లించాల్సి ఉంది’ అని తెలిపారు.
Similar News
News September 3, 2025
లిక్కర్ స్కాం.. చెవిరెడ్డి ఇంట్లో సిట్ తనిఖీలు

AP: లిక్కర్ స్కాం కేసులో తిరుపతి సమీపంలోని తుమ్మలగుంటలో మాజీ MLA చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(ఏ38), చిత్తూరులోని YCP నేత విజయానందరెడ్డి ఇళ్లలో సిట్ తనిఖీలు చేస్తోంది. గత ఎన్నికల్లో చిత్తూరు MLA అభ్యర్థిగా పోటీ చేసిన విజయానందరెడ్డిని ఇటీవల విజయవాడకు పిలిపించిన సిట్ 2రోజులు ప్రశ్నించింది. ఆ సమయంలో చెప్పిన సమాధానాలు, ఆయన ఇంటి అడ్రస్సులో CBR ఇన్‌ఫ్రా కంపెనీ ఉండటంతో వాటి ఆధారంగా సోదాలు జరుగుతున్నాయి.
News September 3, 2025
కవిత ప్రశ్న.. సమాధానం ఎక్కడ..?

ఇవాళ ప్రెస్‌మీట్‌లో అనేక ఆరోపణలు, అంశాలు ప్రస్తావించిన కవిత ఓ ప్రశ్న కూడా సంధించారు. అది అందర్నీ ఆలోచనలో పడేసింది. ‘నా ఫ్లెక్సీలు, దిష్టిబొమ్మలు తగులబెట్టిన BRS కార్యకర్తలు KCRపై CBI దర్యాప్తు చేయిస్తామని రేవంత్ అంటే ఎందుకు నిరసన తెలపలేదు’ అని ప్రశ్నించారు. ఉద్యమ పార్టీ BRSకి ఎన్నో నిరసనలు, ఆందోళనలు చేసిన చరిత్ర ఉంది. ఆ పార్టీ ఇప్పుడు ఎందుకు సరిగా స్పందించలేదని ప్రజలూ సమాధానం కోసం చూస్తున్నారు.
News September 3, 2025
ప్రపంచ నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా రజా

ఐసీసీ వన్డే ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో జింబాబ్వే క్రికెటర్ సికిందర్ రజా అగ్రస్థానంలో నిలిచారు. 302 పాయింట్లతో ఆయన టాప్ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. టాప్-5లో ఒమర్జాయ్, మహ్మద్ నబీ, మెహిదీ హసన్, బ్రేస్‌వెల్ ఉన్నారు. భారత్ నుంచి టాప్-10లో రవీంద్ర జడేజా(9) ఒక్కరే ఉన్నారు. బ్యాటర్ల జాబితాలో గిల్, రోహిత్ టాప్-2లో ఉన్నారు. అలాగే బౌలింగ్ విభాగంలో కేశవ్ మహరాజ్(సౌతాఫ్రికా) అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.