News August 31, 2025

శ్రీకాకుళం: రేపు కలెక్టర్ గ్రీవెన్స్

image

శ్రీకాకుళం నగరంలోని జడ్పీ కార్యాలయంలో సోమవారం ఉదయం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. కార్యాలయానికి వచ్చి తమ ఫిర్యాదులు నేరుగా అందజేయవచ్చన్నారు. ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News September 3, 2025

నిమజ్జనాల్లో డీజేలకు అనుమతులు లేవు: SP

image

శ్రీకాకుళం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహాల నిమర్జన వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులను ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదేశించారు. నిమజ్జనానికి వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలను వినియోగించేందుకు అనుమతులు లేవన్నారు.

News September 3, 2025

చింతపండుకి గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న గిరిజనులు

image

శ్రీకాకుళంలోని ఏజెన్సీ ప్రాంతాలలో చింతపండు సేకరించే గిరిజనులు ఈ ఏడాది గిట్టుబాటు ధర లేక నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. గిరిజన కార్పొరేషన్ నుంచి గిట్టుబాటు ధర లభించక దళారీల దోపిడీకి గురవుతున్నారు. ఈ ఏడాది ఏజెన్సీలో మంచు ఎక్కువగా కురవటంతో చింతపండు ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. దీనికి తోడు గిట్టుబాటు ధర చెల్లించకపోవటంతో దళారీలకే చింతపండు తక్కువ ధరకు ఇచ్చేస్తున్నామని గిరిజనులు వాపోతున్నారు.

News September 3, 2025

అరసవిల్లి సూర్య దేవాలయం మూసివేత

image

అరసవిల్లి ఆదిత్య ఆలయాన్ని ఈ నెల 7న భాద్రపద పౌర్ణమి చంద్ర గ్రహణం సందర్భంగా మూసివేయనున్నట్లు ఆలయ ఈవో ప్రసాద్, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం ఉదయం వరకు ఆలయాన్ని మూసివేస్తున్నామన్నారు. మరుసటి రోజు ఉదయం ఆలయ సంప్రోక్షణ అనంతరం స్వామి దర్శనానికి భక్తులను అనుమతిస్తామన్నారు.