News August 31, 2025

KNR: అతిథి అధ్యాపకుల కొరకు దరఖాస్తుల ఆహ్వానం

image

SRR కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తుందని ప్రిన్సిపల్ కె.రామకృష్ణ తెలిపారు. హిందీ, కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్, బీసీఏ, జువాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్&మిషన్ లర్నింగ్‌లో ఖాళీలు ఉన్నాయన్నారు. పీజీలో 55% మార్కులు, NET, SET, Ph.D, టీచింగ్‌లో అనుభవం ఉన్న వారికి వెయిటేజీ ఉంటుంది. సెప్టెంబర్ 1వ తేదీ సా.4 గం.లలోపు తమ బయోడేటాతో పాటు దరఖాస్తులను సమర్పించాలి.

Similar News

News September 5, 2025

రేపు ఖైరతాబాద్‌ మహాగణపతిని దర్శించుకోనున్న సీఎం

image

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు ఖైరతాబాద్ వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు మహాగణపతిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆయన వెంట పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌, మంత్రులు పొన్నం, సురేఖ కూడా వెళ్తారు. కాగా శనివారం మహాగణపతిని హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయనున్నారు. దీంతో ముందస్తు ఏర్పాట్ల నిమిత్తం ఇవాళ రాత్రి 12 గంటల నుంచే భక్తుల దర్శనాలను నిలిపివేయనున్నారు.

News September 5, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> మహానంది అవార్డు గెలుచుకున్న దేవరుప్పుల వాసి
> సిటీ స్కాన్ అందుబాటులోకి తెచ్చాం: జనగామ ఎమ్మెల్యే
> జనగామ: వన మహోత్సవాన్ని ప్రారంభించిన కలెక్టర్
> కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: కడియం
> పాలకుర్తి: గణేశుడికి 516 పిండి వంటకాలు
> బతుకమ్మ కుంటను అందంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్
> దేవరుప్పుల: ఇసుక అక్రమ రవాణా వ్యక్తిపై కేసు నమోదు
> నాటు సారా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు

News September 5, 2025

ఖమ్మం: పాఠశాలల్లో క్రీడల ప్రోత్సాహంపై కలెక్టర్ సమీక్ష

image

ఖమ్మం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పీఈటీ కోచ్‌లతో సమీక్ష నిర్వహించారు. ప్రతి విద్యార్థి వారానికి 150 నిమిషాల ఫిజికల్ యాక్టివిటీ చేయడం తప్పనిసరి చేయాలని సూచించారు. క్లస్టర్, మండల స్థాయిల్లో పోటీలు నిర్వహించి ప్రతిభావంతులను రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పాఠశాలల్లో స్పోర్ట్స్ కమిటీలు ఏర్పాటు చేసి విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి పెంచాలని సూచించారు.