News August 31, 2025

రేపు చిత్తూరు కలెక్టరేట్‌లో ప్రజా వేదిక: కలెక్టర్

image

చిత్తూరు కలెక్టరేట్‌లో ఆదివారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా అధికారులు ఈ కార్యక్రమానికి తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు ప్రజా వేదికను వినియోగించుకోవాలని సూచించారు.

Similar News

News September 3, 2025

CTR: వ్యభిచార గృహంపై దాడి.. ముగ్గురు అరెస్ట్

image

చిత్తూరు జిల్లా పలమనేరులోని ఓ వ్యభిచారం గృహంపై మంగళవారం సాయంత్రం పోలీసులు రైడ్ చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. జయప్ప వీధిలో జ్యోత్స్న అనే మహిళ విటులును రప్పించి వ్యభిచారం చేయిస్తోందని పోలీసులకు సమాచారం అందింది. వాళ్లు దాడి చేసి ఓ మహిళ, ఓ విటుడితో పాటు నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఏడాదిన్నర నుంచి ఆమె అద్దె ఇంట్లో వ్యభిచారం చేయిస్తున్నట్లు సమాచారం.

News September 3, 2025

చిత్తూరు జిల్లాలో 24 RMP క్లినిక్‌ల మూసివేత

image

చిత్తూరు జిల్లాలోని RMP క్లినిక్‌లపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 76 కేంద్రాలను పరిశీలించారు. 24 క్లినిక్‌లు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు గుర్తించి సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన కఠిన చర్యలు ఉంటాయని DMHO సుధారాణి వెల్లడించారు.

News September 3, 2025

చిత్తూరు: మహిళ మృతిలో ట్విస్ట్

image

SRపురం(M) పాతపాళ్యానికి చెందిన పూజ మృతి హత్య అని తేలింది. SI సుమన్ వివరాల మేరకు.. యాదమరి(M) వరదరాజులపల్లెకు చెందిన వ్యక్తితో పూజకు వివాహం జరగ్గా మూడేళ్ల కిందట అతను చనిపోయాడు. ఆ తర్వాత భాస్కర్ అనే వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. గతనెల 17న పూజను అతను కొట్టి చంపేసి ఉరేసుకున్నట్లు నమ్మించాడు. తల్లి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేసి ఆమెది హత్య అని నిర్ధారించారు. నిన్న రీపోస్ట్‌మార్టం చేశారు.