News August 31, 2025
మా కుటుంబం ఎప్పుడూ బీఫ్ తినలేదు: సల్మాన్ ఖాన్ తండ్రి

తమ కుటుంబం ఇప్పటివరకు బీఫ్ తినలేదని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ తెలిపారు. తాము ముస్లింలైనప్పటికీ తమ ఇంట్లో దానిని నిషేధించామని చెప్పారు. ‘ఆవు పాలు తల్లి పాలతో సమానం. అందుకే మేం బీఫ్‌కు దూరం. ఫుడ్ విషయంలో ఎవరేం తిన్నా అది వారిష్టం. మా ఫ్యామిలీ అన్ని మతాలను గౌరవిస్తుంది. ఇంట్లో అన్ని పండుగలు జరుపుకుంటాం. ఈ ఏడాది కూడా గణపతిని ప్రతిష్ఠించి పూజలు చేశాం’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News September 1, 2025
ఈనెల 7న చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు చూడొచ్చా?

ఈనెల 7న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. కర్కాటక, కుంభ రాశుల వారు ఈ గ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. ‘ఒక వేళ గ్రహణాన్ని వీక్షిస్తే అకారణంగా గొడవలు, వ్యక్తిగత సమస్యలు, ఆందోళన తలెత్తుతాయి. ఈ రెండు రాశుల వారు గ్రహణం పూర్తయ్యాక చంద్రుడికి అభిషేకం చేయాలి. రాహు గ్రహానికి పూజలు చేయాలి. అలాగే పేదలకు ధన సహాయం చేస్తే మంచిది’ అని వారు అంటున్నారు.
News September 1, 2025
నేడు రాజంపేటలో సీఎం పర్యటన.. పెన్షన్ల పంపిణీ

AP: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఇవాళ ఉదయం ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 63,61,380 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.2,746 కోట్ల నిధులను రిలీజ్ చేసింది. సీఎం చంద్రబాబు ఇవాళ అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కె.బోయినపల్లిలో పెన్షన్లు పంపిణీ చేసిన అనంతరం తాళ్లపాక గ్రామంలో లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడుతారు. వారి సమస్యలను స్వయంగా తెలుసుకోనున్నారు.
News September 1, 2025
టారిఫ్స్ లేకపోతే మన దేశం నాశనమయ్యేది: ట్రంప్

ట్రంప్ అధికార పరిధి దాటి టారిఫ్స్ విధిస్తున్నారంటూ <<17559172>>US కోర్టు<<>> ఇటీవల ఆక్షేపించింది. దీనిపై ట్రంప్ తాజాగా స్పందించారు. ‘టారిఫ్స్ వల్ల $ట్రిలియన్లు వచ్చాయి. అవి లేకుంటే మన దేశం పూర్తిగా నాశనమయ్యేది. మన మిలిటరీ పవర్ పోయేది. ఇది ర్యాడికల్ లెఫ్ట్ గ్రూప్ జడ్జిలకు తెలియదు. కానీ డెమోక్రాట్ ఒబామా నియమించిన ఒక్క జడ్జి మాత్రం దేశాన్ని కాపాడేందుకు ఓట్ వేశారు. అతడి ధైర్యానికి థాంక్స్’ అని వ్యాఖ్యానించారు.