News August 31, 2025

జగన్‌కు ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఫోన్

image

AP: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి YS జగన్‌కు ఫోన్ చేసినట్లు వైసీపీ ట్వీట్ చేసింది. కానీ ముందుగానే NDA అభ్యర్థి రాధాకృష్ణన్‌కు మాట ఇచ్చినట్లు జగన్ తెలిపారని పేర్కొంది. మద్దతు ఇవ్వలేకపోతున్నందుకు అన్యధా భావించవద్దని కోరినట్లు చెప్పింది. సుదర్శన్ రెడ్డి న్యాయవ్యవస్థ ద్వారా ప్రజలకు అపార సేవలు అందించారని కొనియాడినట్లు వివరించింది.

Similar News

News September 3, 2025

రుషికొండ ప్యాలెస్‌‌ను మెంటల్ ఆసుపత్రిగా మార్చాలి: అశోక్

image

AP: నిరుపయోగంగా ఉన్న రుషికొండ ప్యాలెస్‌ను మెంటల్ ఆసుపత్రిగా మార్చడం మంచిదని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు సలహా ఇచ్చారు. ఆ భవనంలో పెచ్చులు ఊడాయని తెలిసిందన్నారు. ఈ ప్యాలెస్‌ను ఏం చేస్తే మంచిదో ప్రజలే చెప్పాలని ఆయన కోరారు. గోవా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో క్షత్రియ సేవా సమితి విశాఖలో అశోక్ గజపతిరాజును సత్కరించింది.

News September 3, 2025

హీరో రాజ్ తరుణ్‌పై మరో కేసు

image

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్‌పై నార్సింగి PSలో మరోసారి కేసు నమోదైంది. జూన్ 30న రాజ్ తరుణ్ అనుచరులతో కలిసి తన కుటుంబసభ్యులపై దాడి చేశారని మాజీ ప్రేయసి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారం ఎత్తుకెళ్లడంతో పాటు కుక్కను చంపారని ఆరోపించారు. ఈ ఘటనలో తన తండ్రి గాయపడినట్లు తెలిపారు. ఇది సైబరాబాద్ సీపీ దృష్టికి వెళ్లగా ఆయన ఆదేశాలతో నార్సింగి పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.

News September 3, 2025

యూరియా సమస్య ఎందుకొచ్చింది: జగన్

image

AP: రైతులకు యూరియా కూడా ఇవ్వలేని అధ్వాన స్థితిలో కూటమి పాలన ఉందని YCP చీఫ్ జగన్ ధ్వజమెత్తారు. ‘బస్తా యూరియా కోసం రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. సీజన్‌లో సాగయ్యే పంటల విస్తీర్ణం, ఎంత మొత్తంలో ఎరువుల పంపిణీ చేయాలనేది ఏటా జరిగే కసరత్తే కదా. మరి యూరియా సమస్య ఎందుకొచ్చింది? మా పాలనలో ఈ సమస్య రాలేదు. ఎరువులను మీ పార్టీ నాయకులే దారి మళ్లించి అధిక ధరకు అమ్ముకుంటున్నారు’ అని ట్వీట్ చేశారు.