News August 31, 2025
మోమిన్‌పేటలో భర్తను చంపేసిన భార్య

మోమిన్‌పేట మండలం కేసారంలో దారుణం చోటుచేసుకుంది. బంట్వారం మండలం రొంపల్లికి చెందిన కురువ కుమార్ (36), రేణుక (34) భార్యభర్తలు. కేసారంలోని ఒక వెంచర్‌లో పని చేస్తున్నారు. రోజూ మద్యం తాగి భార్యను వేధిస్తున్న కుమార్ ఆదివారం మద్యం మత్తులో వచ్చి రేణుకను కొట్టాడు. వేధింపులు తాళలేక ఆమె భర్త కళ్లల్లో కారం కొట్టింది. ఓ వైర్‌ను మెడకు బిగించి హత్య చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 3, 2025
HYD: యాక్సిడెంట్.. కాలు తెగి నరకం అనుభవించాడు..!

HYD శామీర్‌పేట్(M) జీనోమ్ వ్యాలీ PS పరిధిలో విషాద ఘటన ఈరోజు జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. జగన్‌గూడలోని కొల్తూరు చౌరస్తా వద్ద బైక్‌పై వస్తున్న ఇద్దరిని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఓ వ్యక్తి కాలు తెగి పడిపోయింది. నొప్పితో విలవిలలాడుతున్న వ్యక్తిని చూసిన స్థానికులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు.చాలా సేపు తర్వాత ‘108’ సిబ్బంది వచ్చి అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
News September 3, 2025
HYD: ఆరోగ్య శాఖ పని తీరుపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష

హైదరాబాద్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో మంత్రి దామోదర రాజనరసింహ ఆరోగ్య శాఖ పనితీరుపై ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై, ఎక్విప్‌మెంట్ పని తీరుపై చర్చించారు. మంత్రి మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ ఎక్విప్‌మెంట్‌లకు వెంటనే రిపేర్ చేయాలని, 8 ఏళ్లు దాటిన ఎక్విప్‌మెంట్‌లను స్క్రాప్‌కు తరలించాలని ఆదేశించారు.
News September 3, 2025
HYD: KCR ఫ్యామిలీ ప్రజాసొమ్ము దోచుకుంది: మహేశ్ గౌడ్

పదేళ్లు దోచుకున్న ప్రజాసొమ్ము పంపకం విషయంలోనే KCR ఇంట్లో గొడవలు జరిగాయని TPCC చీఫ్, MLC మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈరోజు గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. ‘ఎవరి వెంటో ఉండటానికి మాకేం ఖర్మ?, రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి CM.. ప్రజలు మాతో ఉన్నారు.. మేము ప్రజలతో ఉన్నాం.. హరీశ్, సంతోష్ అవినీతిపై కవిత ఆ రోజే ఎందుకు మాట్లాడలేదు.. పంచుకున్నదంతా పంచుకుని ఇప్పుడు బయటకొచ్చి మాట్లాడితే ఎవరు నమ్ముతారు’ అని అన్నారు.