News August 31, 2025
జింబాబ్వే పాలిట సింహస్వప్నంగా నిస్సాంక

జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో శ్రీలంక క్రికెటర్ పాతుమ్ నిస్సాంక చెలరేగుతున్నారు. తొలి వన్డేలో 76 పరుగులు బాదిన ఆయన రెండో మ్యాచులో 122 రన్స్‌తో విరుచుకుపడ్డారు. అంతకుముందు ZIMతో జరిగిన వన్డేల్లోనూ ఆయన 75, 16, 55, 101 పరుగులు బాదారు. కాగా నిస్సాంక అరంగేట్రం (2021) నుంచి వన్డేల్లో అత్యధిక పరుగులు బాదిన ఓపెనర్‌గా (2,648) నిలిచారు. తర్వాత గిల్(2,476), ఒడౌడ్(2,008), రోహిత్ శర్మ (1,990) ఉన్నారు.
Similar News
News September 3, 2025
హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌లపై GST రద్దు

హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌లపై జీఎస్టీని రద్దు చేస్తూ జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో సామాన్యులకు తక్కువ ధరకే హెల్త్, లైఫ్ ప్రీమియంలు లభించనున్నాయి. తద్వారా చాలామంది ఇన్సూరెన్స్‌లు తీసుకునే అవకాశం ఏర్పడనుంది. ఇక లగ్జరీ వస్తువులపై 40శాతం జీఎస్టీ విధించాలని కౌన్సిల్ నిర్ణయించింది.
News September 3, 2025
మరో 11 కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకం

AP: కూటమి ప్రభుత్వం మరో 11 కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించింది. ఆయా కార్పొరేషన్లకు సంబంధించి 120 మంది బోర్డు డైరెక్టర్లను ఎంపిక చేసింది. వీరిలో బీసీలు 42, ఓసీలు 40, ఎస్సీలు 23, మైనార్టీలు 15 మందికి చోటు కల్పించింది.
News September 3, 2025
హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి: VHP నేతలు

APలోని హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఎండోమెంట్ చట్టాన్ని సవరించాలని VHP నేతలు CM చంద్రబాబును కోరారు. ఈ మేరకు అందించిన నమూనా డ్రాఫ్టును పరిశీలిస్తానని ఆయన సానుకూలంగా స్పందించినట్లు VHP కేంద్రీయ సంఘటనా కార్యదర్శి మిలింద్ పరాండే, కేంద్రీయ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు తెలిపారు. CMను కలిసిన వారిలో భాగ్యనగర క్షేత్ర కార్యదర్శి రవికుమార్, రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులున్నారు.