News August 31, 2025

మహిళల, బాలికల భద్రత కోసమే షీ టీమ్స్: ఎస్పీ

image

ఆగస్టులో షీ టీమ్స్ చేపట్టిన చర్యల్లో భాగంగా మెదక్ డివిజన్‌లో ఈవ్‌టీజర్స్‌‌పై 2 ఎఫ్ఐఆర్‌లు, 14 ఈ-పెట్టీ కేసులు, తూప్రాన్ డివిజన్‌‌లో 4 ఈ-పెట్టీ కేసులు నమోదయ్యాయని మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2 ఎఫ్ఐఆర్‌లు, 18 కేసులు నమోదయ్యాయన్నారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన 73 మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు.

Similar News

News September 3, 2025

చేగుంటలో క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు పరీక్షలు

image

చేగుంట గురుకుల పాఠశాలలో ఈనెల 8, 9న గిరిజన గురుకుల క్రీడా పాఠశాలలో 5వ తరగతి ప్రవేశాలకు ఎంపిక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రీజనల్ కోఆర్డినేటర్ గంగారాం నాయక్ తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి బోనఫైడ్, కుల ధ్రువీకరణ పత్రం తీసుకొని ఉదయం 10:30 గంటల లోగా చేగుంట గురుకుల పాఠశాలలో జరిగే పరీక్షకు హాజరు కావాలని సూచించారు.

News September 3, 2025

కౌడిపల్లి: తల్లిదండ్రుల గొడవ.. యువతి ఆత్మహత్య

image

కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్‌కు చెందిన యువతి తల్లిదండ్రుల గొడవతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. బండల మైసయ్య, సమంత దంపతులు తరచూ గొడవ పడుతున్నారు. మంగళవారం సాయంత్రం మళ్లీ గొడవ వద్ద పడుతుండడంతో కూతురు అక్షిత(21) మనస్థాపానికి గురై ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని ఆలస్యంగా బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి తెలిపారు.

News September 3, 2025

మెదక్: ఫిజియో, స్పీచ్ థెరపిస్టులకు దరఖాస్తులు

image

మెదక్ జిల్లాలోని ఐఈఆర్‌సీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రాధాకిషన్ తెలిపారు. తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేసే ఈ పోస్టులకు ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా, సర్టిఫికెట్లతో ఈ నెల 7న ఉదయం 10 గంటల లోగా జిల్లా సమగ్ర శిక్షా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.