News September 1, 2025
కరీంనగర్: ‘సందర్శకులు అప్రమత్తంగా ఉండాలి’

కరీంనగర్‌లో ఎల్‌ఎండీకి సందర్శకుల తాకిడి పెరిగింది. నీటి మట్టం పెరగడంతో పాటు ఆదివారం కావడం వల్ల సాయంత్రం పెద్ద సంఖ్యలో కట్టపై నుంచి రిజర్వాయర్ లోకి వెళ్లారు. ప్రమాదకరంగా నీటిలోకి వెళ్ళి గడిపారు. సమాచారం అందుకున్న ఎల్ఎండీ ఎస్సై శ్రీకాంత్ గౌడ్ చేరుకుని సందర్శకులను అక్కడి నుండి పంపించేశారు. సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు.
Similar News
News September 4, 2025
కరీంనగర్‌లో లీగల్ మెట్రోలజీ కార్యాలయాల మార్పు

కరీంనగర్ పట్టణం భగత్‌నగర్‌లో సాయి కృష్ణ థియేటర్ ఎదురుగా ఉన్న లీగల్ మెట్రోలజీ (తూనికలు, కొలతలు) కార్యాలయాలను LMD కాలనీ, మహాత్మా నగర్ (తిమ్మాపూర్ మండలం), సర్వే నంబర్: 443లో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ భవనంలోకి మార్చారు. ఈ కొత్త భవనంలో లీగల్ మెట్రోలజీకి సంబంధించిన మూడు విభాగాల కార్యాలయాలను మార్చారు. ప్రజలు ఇకపై కొత్త చిరునామాలో సేవలు పొందగలరని అధికార విభాగం తెలిపింది.
News September 3, 2025
KNR: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ పోషకాహార వారోత్సవాలు

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ పోషకాహార వారోత్సవాలు-2025 ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోస్టర్ ప్రదర్శనలు, వ్యాసరచన, ప్రశ్నోత్తర పోటీలు నిర్వహించగా, విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. “ఆరోగ్యమే మహాభాగ్యం, సరైన ఆహారమే ఆరోగ్యానికి మూలం” అని అధ్యాపకులు విద్యార్థులకు సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ డి.వరలక్ష్మి, పోషకాహార విభాగాధిపతి డా. విద్య, జీవ విజ్ఞానశాఖాధిపతి డా.మనోజ్ ఉన్నారు.
News September 3, 2025
KNR: ‘పాఠశాల విద్యలో జిల్లా ఆదర్శంగా నిలవాలి’

పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ముందుస్తుగా ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. పాఠశాల విద్యలో రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాను ఆదర్శంగా నిలువాలని పేర్కొన్నారు. విద్యా రంగంలో ఉపాధ్యాయుల సేవలు వెల కట్టలేనివని, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు.