News September 1, 2025
TODAY HEADLINES

* దోపిడీ చేసేందుకే ప్రాజెక్టు స్థలాన్ని మార్చారు: రేవంత్
* రూ.21వేల కోట్లతో కట్టిన 3 బ్యారేజీలు వృథా: మంత్రి ఉత్తమ్
* మేడిగడ్డ రిపేర్లకు రూ.350 కోట్లే అవుతాయి: KTR
* బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం
* రేషన్ షాపుల్లో రాగులు, గోధుమ పిండి, నూనె: మంత్రి నాదెండ్ల
* జగన్‌కు ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఫోన్
* భారత్-చైనా మధ్య విమాన రాకపోకలు: మోదీ
Similar News
News September 4, 2025
ఆ శరణార్థులకు కేంద్రం గుడ్ న్యూస్

అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాల నుంచి వలస వచ్చిన మైనార్టీలకు(ముస్లిమేతరులు) కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పాస్ పోర్ట్ లేదా ఇతర ప్రయాణ పత్రాలు లేకున్నా దేశంలో ఉండటానికి అనుమతిస్తున్నట్లు తెలిపింది. డిసెంబర్ 31, 2024 వరకు దేశానికి వచ్చిన వారికి ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ యాక్ట్ కింద ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పింది.
News September 4, 2025
18% జీఎస్టీలోకి ఇవే..

సామాన్యులకు ఊరట కల్పించేలా టీవీలపై జీఎస్టీని 28శాతం నుంచి 18శాతానికి కేంద్రం తగ్గించింది. పెట్రోల్, పెట్రోల్ హైబ్రిడ్, ఎల్పీజీ, సీఎన్జీ కార్లు(1,200cc- ఆ లోపు), డీజిల్, డీజిల్ హైబ్రిడ్ కార్లు(1500cc- ఆ లోపు), 3 వీలర్స్, మోటార్ సైకిల్స్(350cc-ఆ లోపు), గూడ్స్ మోటార్ వెహికల్స్, ఏసీలు, అన్ని టెలివిజన్లు, మానిటర్స్, ప్రొజెక్టర్స్, వాషింగ్ మెషీన్స్, సిమెంట్ వంటివి ఈ శ్లాబులోకి రానున్నాయి.
News September 3, 2025
5శాతం శ్లాబులోకి వచ్చిన వస్తువులివే..

సబ్బులు, షాంపూలు, టూత్‌బ్రష్‌లు, టాయిలెట్ సోప్, షేవింగ్ క్రీమ్, హెయిర్ ఆయిల్‌తో పాటు సైకిళ్లపై గతంలో 18% GST ఉండగా ఇప్పుడు 5% శ్లాబులోకి తీసుకొచ్చారు. వెన్న, నెయ్యి, చీజ్, డెయిరీ ప్రొడక్ట్స్, ప్రీ ప్యాకేజ్డ్ నమ్‌కీన్, గిన్నెలు, ఫీడింగ్ బాటిల్స్, న్యాప్‌కిన్స్, కెమికల్ డైపర్స్, కుట్టు మిషన్లు గతంలో 12% శ్లాబులో ఉండగా ఇప్పుడు 5శాతంలోకి తెచ్చారు. ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలూ ఇందులోనే ఉన్నాయి.