News September 1, 2025

శ్రీకాకుళం: నేడు కలెక్టర్ గ్రీవెన్స్

image

శ్రీకాకుళం నగరంలోని జడ్పీ కార్యాలయంలో సోమవారం ఉదయం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. కార్యాలయానికి వచ్చి తమ ఫిర్యాదులు నేరుగా అందజేయవచ్చన్నారు. ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News September 1, 2025

VRకు ఇద్దరు ఎస్ఐలు: ఎస్పీ

image

శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు ఎస్ఐలకు విఆర్‌కు పంపుతూ జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
దీనికి సంబంధించి ఆదివారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్తూరు ఎస్సై ఆలీ మహమ్మద్, హిరమండలం ఎస్సై మహమ్మద్ యాసిన్‌లను విఆర్‌కు పంపారు. ఆయా పోలీస్ స్టేషన్‌లో పరిపాలన పరమైన అంశల్లో లోటుపాట్లు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో తెలిపారు.

News September 1, 2025

శ్రీకాకుళం: యూరియా కొరతపై నేడు ఆందోళన

image

రైతులకు యూరియా అందివ్వని కూటమి ప్రభుత్వం తీరుపై సోమవారం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. పోలాకి మండలం మబగాం కృష్ణదాస్ పార్టీ కార్యాలయం నుంచి ఆదివారం ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళంలోని జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ఆందోళన ప్రారంభమవుతుందన్నారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలి రావాలి అన్నారు.

News August 31, 2025

కలగా మిగిలిన వంశధార-బాహుదా నదుల అనుసంధానం

image

శ్రీకాకుళం జిల్లాలో వంశధార, బాహుదా నదుల అనుసంధానం కలగానే మిగిలింది. గొట్టాబ్యారేజీ నుంచి నీరు వృథాగా సముద్రంలోకి పోతోంది. వంశధార నది నుంచి సుమారు 97,262 టీఎంసీలు బాహుదాకు మళ్లించాలని గతంలో TDP ప్రభుత్వ హయాంలో సంకల్పించారు. ఈ రెండు నదులు అనుసంధానం చేస్తే ఎనిమిది మండలాల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. కూటమి ప్రభుత్వం స్పందించి వంశధార, బాహుదా నదుల అనుసంధానం వెంటనే చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.