News September 1, 2025
ఒంగోలులో సందడి చేసిన హీరో నారా రోహిత్

ఒంగోలులో ఆదివారం సుందరకాండ చిత్రం యూనిట్ సందడి చేసింది. హీరో నారా రోహిత్ నటించిన సుందరకాండ చిత్రం విజయాన్ని అందుకోవడంతో అన్ని జిల్లాల పర్యటన సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నారా రోహిత్, చిత్ర బృందంతో కలిసి ఆదివారం ఒంగోలుకు వచ్చారు. ఒంగోలులోని గోరంట్ల మల్టీప్లెక్స్ థియేటర్ వద్దకు రాగానే ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Similar News
News September 2, 2025
ప్రకాశం: పవన్ బర్త్ డే.. పోటాపోటీగా కేక్ కటింగ్స్!

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ప్రకాశం జిల్లా జనసేన నాయకులు పోటాపోటీగా కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. ఒంగోలులో జిల్లా జనసేన అధ్యక్షుడు రియాజ్, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, ఇతర నాయకులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. అయితే జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హైదరాబాదులోని తన ఇంటిలో నెల్లూరు జనసేన నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు.
News September 2, 2025
జాన్ వెస్లీకి నివాళులర్పించిన ప్రకాశం ఎస్పీ

ఒంగోలులోని చర్చి కూడలి వద్ద గల జాన్ వెస్లీ ఐపీఎస్ విగ్రహానికి మంగళవారం జిల్లా ఎస్పీ దామోదర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. YSR భద్రతా అధికారిగా విధులు నిర్వహించిన జాన్ వెస్లీ హెలికాప్టర్ ప్రమాదంలో వైయస్సార్‌తోపాటు ప్రాణాలు అర్పించి అమరులయ్యారు. ఈ నేపథ్యంలో జాన్ వెస్లీ 16వ వర్ధంతిని పురస్కరించుకొని ఎస్పీ దామోదర్ నివాళులు అర్పించారు.
News September 2, 2025
ప్రకాశం జిల్లాలో మెరుపు దాడులు.!

ప్రకాశం జిల్లాలో ఎరువుల కేంద్రాలపై, యూరియా నిల్వలపై పోలీసులు మంగళవారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. జిల్లా SP దామోదర్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించారు. సాయంత్రానికి తనిఖీల ద్వారా షాపులపై చర్యలు తీసుకుంటారా అన్నది పోలీస్ అధికారులు ప్రకటించే అవకాశం ఉంది. ఈ తనిఖీల్లో DSPలు, CIలు, SIలు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.