News September 1, 2025

గణపవరం మండలం ప.గోలోనే కొనసాగుతుంది: కేంద్రమంత్రి హామీ

image

ప.గో జిల్లాలోనే గణపవరం మండలం కొనసాగుతుందని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. ఆదివారం గణపవరం మండలానికి చెందిన వివిధ వ్యాపార సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు భీమవరంలోని కేంద్రమంత్రి నివాసం వద్ద వర్మను కలిసి మాట్లాడారు. ఈ మేరకు వారందరికీ ఆయన హామీ ఇచ్చారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా మండలాన్ని వేరే జిల్లాలోకి మారుస్తారనే ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు.

Similar News

News September 4, 2025

ఏలూరు పాము కాటుకు గురై యువకుడి మృతి

image

ఉమ్మడి ప.గో జిల్లాలోని ద్వారక తిరుమల మండలం సూర్యచంద్రరావుపేటకు చెందిన అశోక్ (23) పాము కాటుకు గురై మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. అశోక్ పొలం పనులు చేస్తూ తల్లిదండ్రులతో జీవిస్తున్నాడు. బుధవారం పొలం పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వస్తున్న సమయంలో పాము కాటుకు గురయ్యాడు. బంధువులు అతన్ని భీమడోలు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News September 4, 2025

నల్లజర్ల: నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష

image

ఉమ్మడి ప.గో జిల్లా నల్లజర్ల మండలం చీపురుగూడెం గ్రామానికి చెందిన కునపాము బాబూరావుకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.20వేల జరిమానా విధిస్తూ ఏలూరు జిల్లా సెషన్స్ జడ్జి శైఖ్ సికిందర్ బాషా బుధవారం తీర్పు చెప్పారు. 2021లో కల్లు దుకాణం వద్ద జరిగిన ఘర్షణలో బాబూరావు ఇనుపరాడ్‌తో కొట్టడంతో చల్లారి వెంకటేశ్వరరావు మృతి చెందాడు. నేరం రుజువు కావడంతో శిక్ష విధించారు.

News September 4, 2025

భీమవరం: డీఆర్‌ఓ వెంకటేశ్వర్లుకు వీడ్కోలు

image

ఐఏఎస్ సాధించి పదోన్నతిపై వెళ్తున్న జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లుకు దివ్యాంగ్ మహా సంఘటన్ ఆధ్వర్యంలో భీమవరం కలెక్టరేట్‌లో వీడ్కోలు సత్కారం నిర్వహించారు. జిల్లాకు వెంకటేశ్వర్లు అందించిన సేవలు మరువలేనివని, త్వరలో ఆయన కలెక్టర్‌గా రావాలని జిల్లా కలెక్టర్ నాగరాణి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.