News September 1, 2025
గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి.. జగన్ దిగ్భ్రాంతి

AP: రాష్ట్రంలో గణేశ్ నిమజ్జనాల సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకోవడంపై మాజీ సీఎం, YCP అధినేత జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప.గో జిల్లా నరసాపురం మండలం తూర్పు తాళ్లలో ట్రాక్టర్ కింద పడి నలుగురు యువకులు <<17576615>>మరణించడం<<>> కలచివేసిందన్నారు. అల్లూరి(D) పాడేరు చింతలవీధిలో ఇద్దరు భక్తులు మరణించడంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Similar News
News September 4, 2025
TODAY HEADLINES

* GSTలో 5%, 18శాతం శ్లాబులే కొనసాగించాలని కేంద్రం నిర్ణయం
* బుద్ధుందా.. ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు: CBN
* భద్రాద్రిలో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించిన CM రేవంత్
* ఎమ్మెల్సీ పదవికి, BRS పార్టీ సభ్యత్వానికి కవిత రాజీనామా
* ఎన్నికల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ కొంపముంచింది: KTR
* రేవంత్ వెనుక మోదీ, చంద్రబాబు: జగదీశ్ రెడ్డి
* రెడ్ బుక్‌ను మరిచిపోలేదు: మంత్రి లోకేశ్
* జగన్‌పై లోకేశ్ విషప్రచారం చేయిస్తున్నారు: అంబటి
News September 4, 2025
పలువురు ఐఏఎస్‌ల బదిలీలు, పోస్టింగులు

AP: రాష్ట్ర ప్రభుత్వం IASల బదిలీలు, పోస్టింగులు చేపట్టింది. సర్వే సెటిల్‌మెంట్స్&ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్‌గా R.కూర్మనాథ్, తూ.గో. జాయింట్ కలెక్టర్‌గా వై.మేఘస్వరూప్, గుంటూరు JCగా A.శ్రీవాస్తవ, మన్యం JCగా సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, అల్లూరి(D) పాడేరు ITDA POగా తిరుమాని శ్రీపూజ, AP విజిలెన్స్ జాయింట్ సెక్రటరీగా కె.ఆర్.కల్పశ్రీ, విశాఖ(D) రంపచోడవరం ITDA POగా స్మరణ్‌రాజ్‌లను నియమించింది.
News September 4, 2025
వీటిపై త్వరలో 40శాతం జీఎస్టీ!

లగ్జరీ వస్తువులపై త్వరలో 40 శాతం పన్ను విధిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పాన్‌మసాలా, సిగరెట్, గుట్కా, పొగాకు ఉత్పత్తులపై ఈ మేరకు జీఎస్టీ వసూలు చేస్తామని తెలిపారు. ఫ్రూట్ జ్యూస్ కాకుండా నాన్ ఆల్కహాలిక్ బేవరేజెస్‌పై 40శాతం పన్ను ఉంటుందని పేర్కొన్నారు. వీటిపై ఇప్పటి వరకు ఉన్న 28శాతం శ్లాబులే కొనసాగనుండగా, త్వరలో 40 శాతం అమలు చేస్తామన్నారు.