News September 1, 2025

ఈనెల 7న చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు చూడొచ్చా?

image

ఈనెల 7న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. కర్కాటక, కుంభ రాశుల వారు ఈ గ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. ‘ఒక వేళ గ్రహణాన్ని వీక్షిస్తే అకారణంగా గొడవలు, వ్యక్తిగత సమస్యలు, ఆందోళన తలెత్తుతాయి. ఈ రెండు రాశుల వారు గ్రహణం పూర్తయ్యాక చంద్రుడికి అభిషేకం చేయాలి. రాహు గ్రహానికి పూజలు చేయాలి. అలాగే పేదలకు ధన సహాయం చేస్తే మంచిది’ అని వారు అంటున్నారు.

Similar News

News September 1, 2025

చర్మానికి డ్రై బ్రషింగ్ చేస్తున్నారా..?

image

స్నానానికి ముందు శరీరాన్ని డ్రై బ్రషింగ్ చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు చర్మ నిపుణులు. డ్రై బ్రషింగ్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. రక్తప్రసరణను పెంచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే డ్రై బ్రషింగ్ చేసేటపుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా చేస్తే చర్మంపై నొప్పి, దద్దుర్లు, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మైల్డ్‌గా చేయడం ఉత్తమం.

News September 1, 2025

13,217 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

ఐబీపీఎస్ RRB XIV-2025 నోటిఫికేషన్ వెలువడింది. దేశవ్యాప్తంగా 13,217 ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ల పోస్టులున్నాయి. ఇవాళ్టి నుంచి ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాలను బట్టి డిగ్రీ, LLB, డిప్లొమా, CA, MBA/PGDM పూర్తిచేసిన వారు అర్హులు. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాష్ట్రాలు, బ్యాంకులవారీగా ఖాళీలు, ఇతర పూర్తి వివరాల కోసం <>https://www.ibps.in/<<>> వెబ్‌‌సైట్‌లో చూడవచ్చు.

News September 1, 2025

ఆర్టీసీ డ్రైవర్లు ఫోన్లు వాడటం నిషేధం!

image

TG: బస్సు ప్రమాదాలను నివారించేందుకు డ్రైవర్లు విధుల్లో ఫోన్ వాడకుండా నిషేధం విధించాలని RTC నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు పైలట్ ప్రాజెక్టుగా 11 డిపోల్లో దీనిని అమలు చేయనుంది. డ్రైవర్లు డ్యూటీ ఎక్కేముందు తమ ఫోన్లను డిపో మేనేజర్‌కు అప్పగిస్తారు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కండక్టర్‌కు మేనేజర్ సమాచారమిస్తారు. పైలట్ ప్రాజెక్టు ఫలితాలను బట్టి రాష్ట్రవ్యాప్తంగా అమలుపై సంస్థ నిర్ణయం తీసుకోనుంది.