News September 1, 2025

NZB: ధ్వంసమైన అంతర్రాష్ట్ర బ్రిడ్జి

image

రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం బ్రిడ్జి వరద కారణంగా ధ్వంసమైంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరద రావడంతో మునిగిపోయింది. బ్రిడ్జిపై నుంచి సైతం వరద నీరు ప్రవహించడంతో రోడ్డు మార్గం ధ్వంసం అయింది. మహారాష్ట్ర నుంచి వరద నీరు తగ్గుముఖం పడటంతో త్రివేణి సంగమం వద్ద సైతం వరద ఉద్ధృతి తగ్గింది.

Similar News

News September 4, 2025

NZB: 200 సీసీ, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ: CP

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేశ్ శోభయాత్ర కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు CP సాయిచైతన్య తెలిపారు. శోభయాత్ర దారి పొడవునా గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. 200 సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేయనున్నట్లు చెప్పారు. 1,300 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తామని CP వివరించారు.

News September 4, 2025

NZB: డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ మోసం.. కేసు నమోదు

image

సైబర్ నేరగాళ్లు NZBకు చెందిన ఓ వ్యక్తి వద్ద రూ. 10 లక్షలు కాజేసినట్లు NZB సైబర్ క్రైమ్ DSP వెంకటేశ్వరరావు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు బాధితుడికి వీడియో కాల్ చేసి ‘మనీలాండరింగ్ కేసుతో మీ బ్యాంకు ఖాతాకు సంబంధం ఉంది’ అని భయపెట్టి డిజిటల్ అరెస్ట్ చేసినట్లు’ చెప్పి అతడి కుటుంబాన్ని ఇంట్లో నిర్బంధించి రూ.30 లక్షల బదిలీ చేయించుకున్నారు. బాధితుడు 1930ను సంప్రదించగా రూ. 20 లక్షలు స్తంభింపజేశారు.

News September 4, 2025

నిజామాబాద్: ఒక రోజు మద్యం దుకాణాల బంద్

image

వినాయక నిమజ్జనం సందర్భంగా నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని వైన్స్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లు, క్లబ్బులు బంద్ చేయాలని సీపీ సాయి చైతన్య ఆదేశాలు జారీ చేశారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా CP నిర్ణయం తీసుకున్నారు. గణపతి నిమజ్జనం సందర్భంగా జిల్లాలో గురువారం ఉదయం
6 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ పాటించాలన్నారు.