News April 3, 2024

తూ.గో: మంత్రి వేణు వ్యాఖ్యలపై మీ కామెంట్..?

image

వాలంటీర్లపై టీడీపీ కక్ష కట్టిందని సమాచార శాఖ మంత్రి, రూరల్ వైసీపీ ఎమ్మేల్యే అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. మంగళవారం కడియంలోని గిరజాల రైస్‌మిల్ ఆవరణలో మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామి నాయుడుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలుస్తూ ఎందరో వికలాంగులకు, వృద్ధులకు సేవలందిస్తున్న వాలంటీర్లను కించపరచడం టీడీపీకి తగదన్నారు.
– మంత్రి వ్యాఖ్యలపై మీ కామెంట్..?

Similar News

News September 4, 2024

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా సామర్లకోట టీచర్లు

image

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు సామర్లకోట మండలం నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికైనట్లు మండల విద్యాశాఖ అధికారి పుల్లయ్య బుధవారం తెలిపారు. వేట్లపాలెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు కోరా బలరాంబాబు చౌదరి, కాపవరం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అద్దంకి వెంకన్నబాబు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైనట్లు చెప్పారు. సెప్టెంబర్ 5న గురు పూజోత్సవం సందర్భంగా పురస్కారం అందిస్తామని విద్యాశాఖ అధికారి పుల్లయ్య వెల్లడించారు.

News September 4, 2024

ప్రజలను, రైతులను అప్రమత్తం చేయాలి: డిప్యూటీ సీఎం

image

పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు ప్రాంత ప్రజలను, రైతులను అప్రమత్తం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి కార్యాలయం వద్ద ఆయన మాట్లాడారు. జగనన్న కాలనీ ఇప్పటికే ముంపులో ఉన్నందున స్థానికులకు నిత్యావసరాలు అందించాలన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ అధికారులతో సమన్వయం చేసుకొని రైతాంగానికి, ప్రజలకి ధైర్యం చెప్పాలని సూచించారు.

News September 4, 2024

తూర్పుగోదావరి జిల్లాలోని విద్యాసంస్థలకు నేడు సెలవు

image

భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వాసుదేవరావు తెలిపారు. నిబంధనలు అతిక్రమించి జిల్లాలోని ఏ ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలను తెరవద్దని ఆయన సూచించారు.