News September 1, 2025

దివ్యాంగులందరికీ పింఛన్ పంపిణీ

image

AP: <<17398848>>నోటీసులతో<<>> సంబంధంలేకుండా సెప్టెంబర్ నెలలో దివ్యాంగులందరికీ పింఛన్ పంపిణీ చేయాలని CM ఆదేశించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. నోటీసులందుకున్న 1.35లక్షల మందిలో 95% మంది అప్పీల్ చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనర్హులపై రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. కొత్తగా 7,872 మందికి రూ.4వేలు చొప్పున స్పౌజ్ పింఛన్ మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం రూ.3.15 కోట్లు రిలీజ్ చేశారు.

Similar News

News September 4, 2025

నేడు క్యాబినెట్ భేటీ.. వీటిపై కీలక చర్చ

image

AP: CM చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ ఇవాళ భేటీ కానుంది. అమరావతికి సంబంధించి ఇటీవల జరిగిన SIPB, CRDA సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించనుంది. రాజధానిలో భూసేకరణ జరిపేందుకు CRDAకు పాలనపరమైన అనుమతులు మంజూరు చేయనుంది. రూ.53వేల కోట్ల పెట్టుబడులు, 83వేల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పలు పరిశ్రమలకు అనుమతులు ఇవ్వనుంది. అలాగే ఈనెల 18 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌పై చర్చించనుంది.

News September 4, 2025

బెట్టింగ్, లాటరీ, IPL.. వీటిపై GST ఎంతంటే?

image

బెట్టింగ్, క్యాసినో, గ్యాంబ్లింగ్, హార్స్ రైడింగ్, లాటరీ, ఆన్‌లైన్ మనీ గేమింగ్‌పై కేంద్రం 40% GST విధించింది. అలాగే IPL వంటి స్పోర్టింగ్ ఈవెంట్స్‌నూ 40% శ్లాబ్‌లో చేర్చింది. అయితే గుర్తింపు పొందిన స్పోర్ట్స్ ఈవెంట్స్ ఈ శ్లాబ్ పరిధిలోకి రావని చెప్పింది. వీటితో పాటు ఇతర క్రీడా కార్యక్రమాల టికెట్ ధర రూ.500 మించకుంటే జీఎస్టీ వర్తించదని తెలిపింది. అంతకు మించితే 18% ట్యాక్స్ కొనసాగుతుందని పేర్కొంది.

News September 4, 2025

కామారెడ్డి జిల్లాలో నేడు సీఎం పర్యటన

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కామారెడ్డి జిల్లాలో పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఉదయం 11 గంటలకు HYD నుంచి బయలుదేరి 11.30కి లింగంపేట(M) మోతె గ్రామానికి చేరుకుంటారు. వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలిస్తారు. 1:10PMకు కామారెడ్డి టౌన్‌లోని జీఆర్ కాలనీలో పర్యటించి వరద బాధితులను పరామర్శిస్తారు. 2:20PMకు కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్షిస్తారు.