News September 1, 2025
VRకు ఇద్దరు ఎస్ఐలు: ఎస్పీ

శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు ఎస్ఐలకు విఆర్‌కు పంపుతూ జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
దీనికి సంబంధించి ఆదివారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్తూరు ఎస్సై ఆలీ మహమ్మద్, హిరమండలం ఎస్సై మహమ్మద్ యాసిన్‌లను విఆర్‌కు పంపారు. ఆయా పోలీస్ స్టేషన్‌లో పరిపాలన పరమైన అంశల్లో లోటుపాట్లు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో తెలిపారు.
Similar News
News September 4, 2025
ఆమదాలవలస: ఈనెల 10న మెగా జాబ్ మేళా

ఆమదాలవలసలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఈనెల 10న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. బుధవారం ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ క్యాంపు కార్యాలయ సిబ్బంది వివరాలు వెల్లడించారు. ఈ మేళాలో 12 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నట్లు తెలిపారు. 10వ తరగతి ఆపై చదివినవారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగాలు పొందాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
News September 4, 2025
టెక్కలి: రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్ష

టెక్కలి, పలాస డివిజన్ల రెవెన్యూ అధికారులతో బుధవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సమీక్ష నిర్వహించారు. టెక్కలి, పలాస డివిజన్ల పరిధిలోని తహశీల్దార్లు, ఉప తహశీల్దార్లు, ఆర్ఐలు, మండల సర్వేయర్లు, వీఆర్ఓలతో వివిధ అంశాలపై సమీక్షించారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డీఆర్ఓ వెంకటేశ్వరరావు ఉన్నారు.
News September 3, 2025
ఎచ్చెర్ల: కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు 9న వాక్ ఇంటర్వ్యూలు

అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్, సైన్స్ కళాశాలలకు చెందిన వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్స్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు రిజిస్టర్ సుజాత బుధవారం పేర్కొన్నారు. ఈ నెల 9న యూనివర్సిటీలో ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. సీఎస్ఈ, ఎంసీఏ కోర్సుల్లో 6, ఈసీఈలో 4, మెకానిక్‌లో రెండు, సివిల్‌లో 2, మైక్రోబయాలజీలో ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయన్నారు.