News September 1, 2025
భువనగిరి: భూమికి పచ్చాని రంగేసినట్లు..

భూదాన్ పోచంపల్లి పెద్ద చెరువు ఆయకట్టులో వరి పొలాలు పచ్చని రంగుతో పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఏపుగా పెరిగిన వరి చేలు చూడముచ్చటగా ఉన్నాయని సందర్శకులు తెలిపారు. కనుచూపుమేరలో పచ్చని రంగేసినట్లు కనిపించే పొలాలు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. ఈ ప్రాంతానికి వచ్చిన సందర్శకులు ఈ దృశ్యాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News September 5, 2025
చీర కట్టు.. ఆరోగ్యానికి మెట్టు

ఇంట్లో ఫంక్షన్లు, పండుగలకు తప్ప మహిళలు చీరలు కట్టుకోవడం బాగా తగ్గింది. అయితే రోజూ చీరను ధరించడం వల్ల పలు ప్రయోజనాలున్నాయి. చీర భారతీయ సంస్కృతి, సంప్రదాయ, గౌరవానికి చిహ్నం. చీర థర్మోస్‌లాగా పనిచేసి వేసవిలో శరీరాన్ని చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంచుతుంది. చీర వదులుగా ఉండటం వలన రక్తప్రసరణ బాగుంటుంది. అలాగే చీర మనలో పాజిటివ్ ఎనర్జీని, కాన్ఫిడెన్స్‌ను తీసుకొస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంచుతుంది.
News September 5, 2025
కర్నూలు: ఆయన.. ఓ టీచర్, నటుడు, డైలాగ్ రైటర్, టీ స్టాల్ మాస్టర్

వెల్దుర్తిలో మేనమామ ఇంట్లో ఉంటున్న దేవనకొండ(M) జిల్లెడుబుడకల గ్రామానికి చెందిన దివాన్ జీవన పోరాటం అందరికీ ఆదర్శంగా మారుతోంది. ఉదయం ప్రైవేట్ జూనియర్ కళాశాలలో అకౌంట్స్ లెక్చరర్‌గా, సాయంత్రం టీ స్టాల్‌లో మాస్టర్‌గా పనిచేస్తున్నారు. సినిమాలపై ఆసక్తితో ‘వెంకీ మామ, బడుగు జీవులు, యువచైతన్యం’ చిత్రాల్లో నటించారు. ‘రక్తచరిత్ర-3, ఉంటే ఇలాగే ఉండాలి’ చిత్రాలకు డైలాగ్ రైటర్‌గా పనిచేస్తున్నారు.
News September 5, 2025
శానిటరీ ప్యాడ్స్కూ ఎక్స్పైరీ డేట్

మహిళలు పీరియడ్స్‌లో న్యాప్‌కిన్స్, మెన్‌స్ట్రువల్ కప్స్, ట్యాంపన్స్ వాడతారు. కానీ వీటి ఎక్స్‌పైరీడేట్ గురించి పట్టించుకోరు. ఎక్స్‌పైర్ అయిన ప్రొడక్ట్స్‌పై బ్యాక్టీరియా, వైరస్ పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వాటిని వాడితే జననేంద్రియాల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ముప్పు పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి వీటిని వినియోగించేముందు లేబుల్‌ని తప్పకుండా పరిశీలించాలని సూచిస్తున్నారు.