News September 1, 2025

NGKL: ప్రీ-ప్రైమరీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని 21 పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ల, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇన్‌స్ట్రక్టర్ల ఉద్యోగానికి ఇంటర్మీడియట్, ఆయా ఉద్యోగానికి 7వ తరగతి విద్యార్హత కనీస అర్హతలుగా నిర్ణయించారు. దరఖాస్తులను ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1లోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని అధికారులు తెలిపారు.

Similar News

News September 5, 2025

బయట టీ తాగుతున్నారా?

image

TG: హైదరాబాద్‌లోని 42 టీ పౌడర్ యూనిట్లు & టీ షాపుల్లో GHMC ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. 19 చోట్ల నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. రిపోర్ట్స్ వచ్చాక వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే శుభ్రత పాటించే దుకాణాల్లోనే టీ తాగాలని సూచించారు. ‘స్వచ్ఛమైన టీ ఆకులు తడి క్లాత్‌పై రుద్దితే అవి రంగుని వదలవు. కల్తీ టీ పొడిని నీటిలో కలపగానే ముదురు ఎరుపు రంగులోకి మారుతుంది’ అని అవగాహన కల్పించారు.

News September 5, 2025

VZM: ఐటీఐ ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్‌లో 600/600

image

ఇటీవల జరిగిన ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్‌లో విజయనగరం ప్రభుత్వ ఐటీఐ విద్యార్థి ఎర్ల సాయి సత్తా చాటాడు. సీనియర్ ఎలక్ట్రీషియన్ విభాగంలో 600/600 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడని ప్రిన్సిపల్ టీవీ గిరి తెలిపారు. సీనియర్ ఎలక్ట్రీషియన్ విభాగంలో 590 ప్లస్ మార్కులను ఆరుగురు విద్యార్థులు సంపాదించారన్నారు. జూనియర్ విభాగంలో కూడా మంచి ఉత్తీర్ణత నమోదైందని వెల్లడించారు.

News September 5, 2025

సారా టెండూల్కర్ ఎంగేజ్‌మెంట్ అయ్యిందా?

image

సచిన్ కూతురు సారా ఎంగేజ్మెంట్ వార్తలు బీటౌన్‌లో వైరల్ అవుతున్నాయి. గోవా రెస్టారెంట్ ఓనర్ సిద్ధార్థ్ కేర్కర్‌తో సారా చనువుగా ఉన్న ఫొటోలు బయటికి వచ్చాయి. దీంతో వీరిద్దరి నిశ్చితార్థం అయ్యిందా? అని సందేహిస్తూ పలు న్యూస్ సైట్లు వార్తలు ప్రచురించాయి. గతంలో వీరు గోవాలో దిగిన ఫొటోలనూ షేర్ చేశాయి. దీనిపై సచిన్ ఫ్యామిలీ స్పందించాల్సి ఉంది. సచిన్ కొడుకు అర్జున్‌కు ఇటీవల ఎంగేజ్మెంట్ అయిన విషయం తెలిసిందే.