News April 3, 2024
కృష్ణా: పీహెచ్‌డీ/ఎం.ఫిల్ విద్యార్థులకు ముఖ్య గమనిక

కృష్ణా వర్సిటీ పరిధిలో పీహెచ్‌డీ/ఎం.ఫిల్ పార్ట్-1 విద్యార్థులు రాయాల్సిన థియరీ పరీక్షల (రెగ్యులర్ & సప్లిమెంటరీ) టైం టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 25, 26, 27 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకు విద్యార్థులు KRU అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
Similar News
News March 21, 2026
కృష్ణా: జేసీ హెచ్చరిక

జిల్లాలో LPG గ్యాస్ సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ శుక్రవారం హెచ్చరించారు. జిల్లాలో ఎటువంటి గ్యాస్ సిలిండర్ల కొరత లేదన్నారు. ప్రజల్లో నెలకొన్న అలజడి కారణంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయన్నారు. వినియోగదారుల సందేహాలను నివృత్తి చేసేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ (08672-252493) ఏర్పాటు చేశామన్నారు.
News March 19, 2026
కృష్ణా జిల్లాలో ధాన్యం సేకరణ రికార్డు.. రూ. 1,744 కోట్ల చెల్లింపులు!

కృష్ణా జిల్లాలో 2025-26 ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియ దిగ్విజయంగా పూర్తయినట్లు జాయింట్ కలెక్టర్ నవీన్ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 92,639 మంది రైతుల నుంచి మొత్తం 7.34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. దీని విలువ రూ. 1,744.50 కోట్లుగా ఉంది. రైతు సేవా కేంద్రాల ద్వారా పారదర్శకంగా కొనుగోళ్లు జరిపామని, అన్నదాతలకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
News March 18, 2026
కృష్ణా: పదో తరగతి హిందీ పరీక్షకు 233 మంది గైర్హాజరు

పదో తరగతి హిందీ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. మొత్తం 21,312 మంది విద్యార్థులకు గాను 21,079 మంది పరీక్షకు హాజరయ్యారు. 233 మంది గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయ వర్గాలు తెలిపాయి. DLO 4, DEO 7, ACGE 5, డిస్ట్రిక్ట్ మోనటరింగ్ కో-ఆర్డినేటర్స్ 5, ఫ్లైయింగ్ స్క్వాడ్స్ 45 కేంద్రాలను తనిఖీ చేశాయి. ఓపెన్ స్కూల్ పరీక్షలకు సంబంధించి 598 మందికి 437 మంది హాజరయ్యారని తెలిపారు.


