News September 1, 2025

CBIకి ‘కాళేశ్వరం కేసు’.. బండి సంజయ్ ఏమన్నారంటే?

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతికి BRS మాత్రమే బాధ్యత వహిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘మేం మొదటి నుంచీ CBIతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశాం. కానీ INC ప్రభుత్వం ఆలస్యం చేసింది. నేడు సత్యానికి తలవంచి కేసును <<17577217>>CBIకి<<>> అప్పగించేందుకు అంగీకరించింది. ORR టోల్ టెండర్లపై SIT ఏర్పాటు చేస్తామని చెప్పి చేయలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా సీరియల్‌లా సాగుతోంది’ అని ట్వీట్ చేశారు.

Similar News

News September 4, 2025

పోటీ పరీక్షలు రాసే దివ్యాంగులకు అలర్ట్

image

పోటీ పరీక్షల్లో దివ్యాంగులే సొంత స్క్రైబ్(సహాయకులు)ను తెచ్చుకునే విధానానికి కేంద్రం ముగింపు పలకనుంది. అవకతవకలు అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, SSC, UPSC వంటి సంస్థలు సొంతంగా తయారుచేసుకున్న స్క్రైబ్‌లనే కేటాయించాలని ఆదేశించింది. అభ్యర్థి కన్నా స్క్రైబ్ వయసు 2, 3 విద్యా సంవత్సరాలు తక్కువుండాలి. ఇద్దరూ ఒకే పోటీ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతూ ఉండకూడదని తెలిపింది.

News September 4, 2025

అమెరికాలో ఆర్థిక మాంద్యం తప్పదా?

image

అమెరికా ఆర్థిక మాంద్యం అంచున ఉందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ‘మూడీస్’ చీఫ్ ఎకనామిస్ట్ మార్క్ జండీ తెలిపారు. ప్రస్తుత ద్రవ్యోల్బణం 2.7% ఉంటే అది వచ్చే ఏడాదికి 3%-4%కి పెరిగే అవకాశం ఉందని చెప్పారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, ఉద్యోగాలు పోతున్నాయని పేర్కొన్నారు. టారిఫ్స్ పెంచడంతో అమెరికా కంపెనీలు నష్టపోతున్నాయని వివరించారు. కాగా 2008 మాంద్యాన్ని అంచనా వేసిన తొలి ఆర్థికవేత్త ఈయనే.

News September 4, 2025

దేశానికి ఇదే నిజమైన దీపావళి కానుక: పవన్

image

AP: GST సంస్కరణలను Dy.CM పవన్ స్వాగతించారు. ‘స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఇచ్చిన మాటను PM మోదీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఈ మార్పులతో పేద, మధ్య తరగతి, రైతులకు చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా విద్య, జీవిత బీమాపై GST తొలగింపు కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది. దేశానికి ఇదే నిజమైన దీపావళి కానుక. నిర్మలా సీతారామన్, జీఎస్టీ కౌన్సిల్‌కు ప్రత్యేక ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.