News September 1, 2025
చిత్తూరు జిల్లాలో నేటి నుంచి రేషన్ పంపిణీ

జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి రేషన్ పంపిణీ చేయనున్నట్లు డీఎస్ఓ శంకరన్ తెలిపారు. మొత్తం 1,339 చౌక దుకాణాల పరిధిలోని 5.40 లక్షల కార్డుదారులకు బియ్యంతో పాటు చక్కెర, కందిపప్పు అందించనున్నారన్నారు. ఇందుకుగాను జిల్లాకు 8 వేల మెట్రిక్ టన్నుల బియ్యం, 3 వేల మెట్రిక్ టన్నుల చక్కెర వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
Similar News
News September 7, 2025
కుప్పంలో 30 పోలీస్ యాక్ట్ : DSP

కుప్పం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో ఈ నెల 30వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని కుప్పం DSP పార్థసారథి తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా 30 పోలీస్ యాక్ట్‌ను అమలు చేయడం జరుగుతుందని, పోలీసుల అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు వంటివి నిర్వహించకూడదని స్పష్టం చేశారు. పోలీసుల అనుమతి లేకుండా ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News September 6, 2025
జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ను పరిశీలించిన ఎస్పీ

రిక్రూట్ కానిస్టేబుళ్ల శిక్షణ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ వీఎన్. మణికంఠ చందోలు శనివారం చిత్తూరు పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ను సందర్శించారు. ఎస్పీ బ్యారక్స్, డైనింగ్ హాల్, కిచెన్, వైద్య సదుపాయాలు, సీసీ కెమెరా పర్యవేక్షణ వంటి విభాగాలను సమగ్రంగా పరిశీలించారు. రిక్రూటర్లుకు పరిశుభ్ర వాతావరణం, తాగునీరు, ఆరోగ్య సదుపాయాలు, భద్రతా చర్యలు అత్యుత్తమంగా ఉండాలని తెలిపారు.
News September 5, 2025
గురువులు సమాజ నిర్దేశకులు: చిత్తూరు MLA

గురువుల సమాజ నిర్దేశకులని కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ అన్నారు. చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమానికి వారు హాజరయ్యారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో వారి కృషి మరువలేనిదని కొనియాడారు. గురువులకు ఎప్పుడు సమాజంలో ఉన్నత స్థానం ఉంటుందని తెలియజేశారు.