News September 1, 2025

చంద్రబాబును సంప్రదించలేదు: సీఎం రేవంత్

image

TG: 2024 ఎన్నికల తర్వాత ఇండీ కూటమికి మద్దతు ఇవ్వాలంటూ తాను AP CM చంద్రబాబును సంప్రదించినట్లు జరిగిన ప్రచారం అవాస్తవమని CM రేవంత్ తెలిపారు. రాహుల్ గాంధీ అలాంటి రాజకీయాలను ఇష్టపడరని, తానెప్పుడూ ఆ ప్రయత్నం చేయలేదని ఇండియా టుడే పాడ్‌కాస్ట్‌లో స్పష్టం చేశారు. ‘చంద్రబాబు సీనియర్ పొలిటీషియన్. గతంలోనూ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. రాజకీయ ఎత్తుగడల్లో ఆయన్ను మించినవారు లేరు’ అని పేర్కొన్నారు.

Similar News

News September 23, 2025

WIతో టెస్ట్ సిరీస్.. భారత జట్టు ఇదేనా?

image

వెస్టిండీస్‌తో OCT 2 నుంచి స్వదేశంలో జరగనున్న 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు BCCI ఇవాళ జట్టును ప్రకటించే అవకాశముంది. కాలి గాయం నుంచి పంత్ కోలుకోకపోవడంతో టీమ్‌కు దూరం కానున్నారు. ఈ నేపథ్యంలో Cricbuzz 15 మంది సభ్యులతో ఎక్స్‌పెక్టెడ్ స్క్వాడ్‌ను ప్రకటించింది.
IND(అంచనా): గిల్(C), జైశ్వాల్, రాహుల్, సుదర్శన్, పడిక్కల్, జురేల్, జడేజా, సుందర్, అక్షర్, బుమ్రా, కుల్దీప్, సిరాజ్, ప్రసిద్ధ్, నితీశ్, జగదీశన్

News September 23, 2025

వేణుగోపాల్‌పై మావోయిస్టు పార్టీ చర్యలు

image

<<15966343>>‘అభయ్’<<>> పేరుతో కేంద్రంతో శాంతి చర్చలకు పిలుపునిచ్చిన మల్లోజుల వేణుగోపాల్‌ను మావోయిస్టు కేంద్ర కమిటీ ‘ద్రోహి’గా పేర్కొంది. తన వద్ద ఉన్న ఆయుధాలను వెంటనే పార్టీకి అప్పగించాలని ఆదేశించింది. లేదంటే పీపుల్స్ గెరిల్లా ఆర్మీ వాటిని స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించింది. మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ తమ్ముడే వేణుగోపాల్. కిషన్‌జీ భార్య సుజాతక్క ఇటీవల పోలీసులకు <<17695477>>లొంగిపోయిన<<>> విషయం తెలిసిందే.

News September 23, 2025

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు భారీగా పెరిగి ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,260 పెరిగి రూ.1,14,330కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10g గోల్డ్ రూ.1,150 ఎగబాకి రూ.1,04,800 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1,000 పెరిగి రూ.1,49,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.