News September 1, 2025
మిస్టర్ గాంధీ.. మీ CM ఏం చేస్తున్నారో మీకైనా తెలుసా: KTR

TG: కాంగ్రెస్ ప్రభుత్వం తమపై ఎన్ని కుట్రలు చేసినా చట్టపరంగా పోరాడతామని KTR అన్నారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని ట్వీట్ చేశారు. ‘తెలంగాణలో రాహుల్ గాంధీ కరెన్సీ మేనేజర్ (CM) కాళేశ్వరం కేసును CBIకి అప్పగించాలని నిర్ణయించారు. రాహుల్ గాంధేమో బీజేపీకి CBI “ప్రతిపక్ష ఎలిమినేషన్ సెల్”లా పనిచేస్తోందని గతంలో ఆరోపించారు. మిస్టర్ గాంధీ.. మీ CM ఏం చేస్తున్నారో మీకైనా తెలుసా’ అని KTR ప్రశ్నించారు.
Similar News
News September 5, 2025
ప్రిటోరియా క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా గంగూలీ

SA టీ20లో ప్రిటోరియా క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా భారత మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ నియమితులయ్యారు. లీగ్ కమిషనర్ గ్రేమీ స్మిత్ ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే సీజన్ వరకు దాదా ఆ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తారు. ఈ లీగ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ అంతగా ఆకట్టుకోలేదు. ఇప్పటివరకు ఆ జట్టు ఒక్క టైటిల్ కూడా కొట్టలేదు. ఒకే ఒక్కసారి రన్నరప్‌గా నిలిచింది. దాదా ఆధ్వర్యంలో ఈసారి కప్ సాధించాలని ప్రిటోరియా భావిస్తోంది.
News September 5, 2025
హైదరాబాద్‌కు సీబీఐ డైరెక్టర్.. కాళేశ్వరం కేసు గురించేనా?

TG: CBI డైరెక్టర్ ప్రవీణ్ సూద్ HYDకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. దీంతో ఈ కేసు గురించి చర్చించేందుకే సీబీఐ డైరెక్టర్ వచ్చారా? అనే చర్చ మొదలైంది. మరోవైపు న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసును దర్యాప్తు చేయాలని ఇటీవల సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ కేసు విషయమై ప్రవీణ్ సూద్ వచ్చారా? అనేది తెలియాల్సి ఉంది.
News September 5, 2025
ఓటీటీలో ట్రెండింగ్ నం.1గా ‘కన్నప్ప’: మంచు విష్ణు

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘కన్నప్ప’ చిత్రం నిన్నటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఓటీటీలోనూ ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోందని విష్ణు ట్వీట్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నంబర్ 1గా ట్రెండ్ అవుతోందని తెలిపారు. ప్రేక్షకులు చూపుతున్న ఆదరణకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ కీలక పాత్రల్లో నటించారు.