News September 1, 2025
చంద్రబాబు తొలిసారి సీఎం అయి నేటికి 30 ఏళ్లు

చంద్రబాబు తొలిసారి 1995 SEP 1న ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో గెలిచి, 2004 మే 29 వరకు CMగా ఉన్నారు. రాష్ట్రం విడిపోయాక 2014లో ఏపీకి మొదటి సీఎం అయ్యారు. మళ్లీ 2024లో గెలిచి, పదవిలో కొనసాగుతున్నారు. హైటెక్ సిటీ, రైతు బజార్లు, ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, ఈ-గవర్నెన్స్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. మరి CBN పేరు చెబితే మీకు గుర్తొచ్చేది ఏంటో కామెంట్ చేయండి.
Similar News
News September 23, 2025
బతుకమ్మ ఆడుతూ ఇద్దరు మృతి

TG: బతుకమ్మ పండుగ వేళ 2 కుటుంబాల్లో విషాదం నెలకొంది. మహబూబాబాద్(D) ఎంచగూడెంకు చెందిన మౌనిక(32) ఈనెల 21న ఎంగిలిపూల బతుకమ్మ ఆడేందుకు వెళ్లగా DJ సౌండ్‌తో గుండెపోటుకు గురయ్యారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. ఆమెకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. సంగారెడ్డి(D) మాచిరెడ్డిపల్లిలో మేఘన(24) బతుకమ్మ ఆడుతూ ఛాతీనొప్పితో కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయారు.
News September 23, 2025
ఎమ్మెల్యేలు నెలకోరోజు పొలాలకు వెళ్లండి: చంద్రబాబు

AP: వ్యవసాయంపై శాసనసభ్యులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. అక్టోబర్ నుంచి నెలకో రోజు పొలాలకు వెళ్లాలని అసెంబ్లీలో సభ్యులకు తెలిపారు. రైతులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలన్నారు. త్వరలో తానూ అన్నదాతల్ని కలుస్తానని పేర్కొన్నారు. పంట ధరలు తగ్గితే ఆదుకుంటున్నామని వెల్లడించారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించేందుకు భూసార పరీక్షలు చేసి సూక్ష్మపోషకాలు అందిస్తామన్నారు.
News September 23, 2025
రాష్ట్రంలో భిన్న వాతావరణం

TG: గత 4-5 రోజులుగా రాష్ట్రంలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. పొద్దంతా ఎండ, ఉక్కపోతగా ఉంటూ సాయంత్రం వర్షం కురుస్తోంది. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు వర్షం కొనసాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న యాదాద్రిలోని పాముకుంటలో 11.3cm, HYDలోని షేక్‌పేటలో 10.1cm, శ్రీనగర్ కాలనీలో 9.55cmల వర్షపాతం నమోదైంది. రాబోయే 2రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD తెలిపింది.