News September 1, 2025
రాష్ట్రంలో గుంటూరు జిల్లాకు 7వ స్థానం

రాష్ట్ర EPTSలో గుంటూరు జిల్లా 7వస్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 39,349 డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయగా, అందులో జీవోలు 1969, మెమోలు 800, సర్క్యులర్లు 1291, లేఖలు 14,975 ఉన్నాయి. గుడ్ గవర్నెన్స్ కోసం EPTS కీలకమని, వెనుకబడిన జిల్లాలు తక్షణం పనితీరు మెరుగుపరచాలని ప్రభుత్వం ఆదేశించింది.
Similar News
News September 2, 2025
మేరికపూడిలో విషాదం.. తండ్రీకొడుకుల దుర్మరణం

ఫిరంగిపురం మండలం మేరికపూడి గ్రామంలో ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు మృతిచెందారు. ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో భార్గవ్ (23) అక్కడికక్కడే మరణించగా, ఆయన తండ్రి వెంకటేశ్వర్లు (55) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబంలో ఇద్దరి మృతి స్థానికులను కంటతడి పెట్టించింది.
News September 2, 2025
తెనాలిలో 108 మంది వీణ కళాకారులతో సంగీత ఉత్సవం

తెనాలికి చెందిన శ్రీ విద్యాపీఠం, సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన వీణ సంగీత ఉత్సవం జరుగనుంది. మూలా నక్షత్రం సందర్భంగా చెంచుపేటలోని పద్మావతి కల్యాణ మండపంలో ఆరోజు సాయంత్రం 5.15 గంటలకు సంగీత ఉత్సవం ప్రారంభమవుతుందని పెనుగొండ శ్రీ వాసవి క్షేత్ర పీఠాధిపతి బాల స్వామీజీ తెలిపారు. వివిధ ప్రాంతాలకు చెందిన 108 మంది వీణ కళాకారులతో తెనాలిలో తొలిసారిగా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.
News September 2, 2025
గుంటూరు జిల్లా నిరుద్యోగులకు ముఖ్య గమనిక

గుంటూరు జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ ఆఫీసర్, ఎఫ్ఎస్ఓ, సోషల్ వర్కర్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి విడతలో ఎంపికైన వారికి ఇప్పటికే నియామకాలు ఇచ్చామని అధికారులు తెలిపారు. రెండో విడత ఎంపిక జాబితాను సిద్ధం చేసి జిల్లా వెబ్‌సైట్‌లో ఉంచారు. ఈ జాబితాలో ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 3న ఉదయం 10 గంటలకు డీఎంహెచ్ కార్యాలయంలో ధ్రువపత్రాలతో హాజరావాలన్నారు.