News September 1, 2025
బంధాలపై ఫబ్బింగ్ ప్రభావం

ప్రస్తుతం మొబైల్ వాడకం బాగా పెరిగిపోయి చాలామంది జీవితాల్లో శత్రువుగా మారింది. ఎదుటివ్యక్తితో నేరుగా మాట్లాడకుండా ఫోన్‌పై దృష్టి పెట్టి, వారిని విస్మరించడాన్ని ఫబ్బింగ్ అంటారు. ఇది బంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. ఫబ్బింగ్ ఎక్కువైతే భార్యాభర్తల మధ్య గొడవలు పెరుగుతాయి. కమ్యూనికేషన్ తగ్గిపోతుంది. కాబట్టి ఫోన్‌ని పక్కనపెట్టి భాగస్వామితో మనసు విప్పి మాట్లాడాలంటున్నారు నిపుణులు.
Similar News
News September 5, 2025
హెల్త్ ఎమర్జెన్సీగా తురకపాలెం మరణాలు: సీఎం చంద్రబాబు

AP: గుంటూరు తురకపాలెంలో వరుస మరణాలపై మరింత లోతుగా పరిశోధన చేయాలని CM చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు. శని, ఆదివారాల్లో అన్ని రకాల వైద్య పరీక్షలు జరిపి సోమవారం కల్లా ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలన్నారు. కొత్త కేసులు నమోదు కాకుండా స్థానిక ప్రజల్లో నమ్మకాన్ని పెంచాల్సిన బాధ్యత వైద్యాధికారులదేనని స్పష్టం చేశారు. హెల్త్ ఎమర్జెన్సీగా పరిగణించి చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
News September 5, 2025
భవిష్యత్తులో GST 3.0.. నిర్మల ఏం చెప్పారంటే?

సామాన్యులపై భారం తగ్గేలా జీఎస్టీ 2.0 తీసుకొచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ India Todayతో అన్నారు. భవిష్యత్తులో జీఎస్టీ 3.0 కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు. దాని ద్వారా ధరల్లో స్థిరత్వం, పారదర్శకత తీసుకురానున్నట్లు వెల్లడించారు. చిరు వ్యాపారుల్లో ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా ట్యాక్స్‌ల నిబంధనలు రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. వారిపై భారం పడకుండా చూస్తామని నిర్మల వెల్లడించారు.
News September 5, 2025
రాస్ టేలర్ సంచలన నిర్ణయం

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ రాస్ టేలర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తన తల్లి పుట్టిన సమోవా దేశం తరఫున త్వరలో బరిలోకి దిగనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆ దేశ పాస్‌పోర్ట్ కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా 41 ఏళ్ల టేలర్ కివీస్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 18 వేలకుపైగా పరుగులు సాధించారు. 2022లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగారు.