News September 1, 2025

నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు: IMD

image

బంగాళాఖాతంలో మరో 12-36 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుందని IMD HYD తెలిపింది. దీని ప్రభావంతో AP, TGలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు ఉ.8.30 వరకు <>TG<<>>లోని కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంది. అటు APలోని SKLM, VZM, మన్యం, అల్లూరి, VSP, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.

Similar News

News September 12, 2025

లోన్ చెల్లించకపోతే ఫోన్ లాక్.. త్వరలో కొత్త రూల్?

image

లోన్‌పై కొనుగోలు చేసిన ఫోన్ల విషయంలో RBI కొత్త రూల్ తీసుకొచ్చే అవకాశం ఉంది. సకాలంలో లోన్ చెల్లించకపోతే ఫోన్లను రిమోట్‌ విధానంలో లాక్ చేసేలా రుణదాతలకు RBI అనుమతి ఇవ్వనున్నట్లు జాతీయ మీడియా తెలిపింది. ‘దీనికి యూజర్ల ముందస్తు అనుమతి, డేటా ప్రొటెక్షన్‌ను తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలను రూపొందించనుంది. ఫోన్ లాక్ అయ్యేందుకు అందులో ముందే ఓ యాప్‌ను ఇన్‌స్టాల్ చేస్తారు’ అని పేర్కొంది.

News September 12, 2025

భారత్‌తో మ్యాచ్.. పాక్ కోచ్ ఏమన్నారంటే?

image

ఆసియా కప్‌లో భాగంగా ఈ నెల 14న జరిగే IND, PAK మ్యాచులో రిస్ట్ స్పిన్నర్ల మధ్యే పోటీ ఉంటుందన్న అభిప్రాయాలపై PAK కోచ్ మైక్ హెసన్ స్పందించారు. ‘దుబాయ్ పిచ్ స్పిన్‌కు అంతగా సహకరిస్తుందని అనిపించడం లేదు. UAEతో మ్యాచులో కుల్దీప్ యాదవ్ బాల్‌ను ఎక్కువగా స్పిన్ చేయలేదు. రిస్ట్ స్పిన్నర్లుంటే సర్ఫేస్‌తో పనిలేదు. మా జట్టులోనూ ఐదుగురు స్పిన్నర్లున్నారు. నవాజ్ వరల్డ్‌లోనే బెస్ట్ స్పిన్నర్’ అని పేర్కొన్నారు.

News September 12, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.