News September 1, 2025

E20 పెట్రోల్‌పై పిల్.. కొట్టేసిన సుప్రీంకోర్టు

image

20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకాలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఇథనాల్ లేని పెట్రోల్‌ను ఎంచుకునే సౌకర్యం వినియోగదారులకు కల్పించాలని కోరుతూ అక్షయ్ మల్హోత్రా అనే లాయర్ ఈ పిల్ దాఖలు చేశారు. E20 పెట్రోల్ వల్ల మైలేజీ తగ్గుతోందని పలువురు వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే మైలేజీలో ఎలాంటి తేడాల్లేవని కేంద్రం చెబుతోంది.

Similar News

News September 23, 2025

జుబీన్ మృతదేహానికి మరోసారి పోస్టుమార్టం

image

అస్సాం ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్(52) మృతదేహానికి మరో సారి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు సీఎం హిమంత బిస్వశర్మ తెలిపారు. కొన్ని వర్గాలు ఆయన <<17783688>>మరణంపై<<>> అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సింగపూర్ వైద్యులు ఇచ్చిన డెత్ సర్టిఫికెట్‌పై అనుమానాలు ఉన్నాయని, సీఐడీకి కేసు అప్పగిస్తామని ఇప్పటికే సీఎం చెప్పారు. కాగా ఇవాళ అధికార లాంఛనాలతో జుబీన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

News September 23, 2025

24 ఏళ్లలో మోదీ ఒక్క సెలవు తీసుకోలేదు: అమిత్ షా

image

గత 24 ఏళ్లలో మోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. నిర్విరామమైన పని PM నిర్ణయాలపై, పనివేగంపై ప్రభావం చూపలేదన్నారు. కఠినమైన లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. పార్టీలో ఎలాంటి బాస్ కల్చర్ లేదన్నారు. మోదీ నాయకత్వంలో 2047 నాటికి స్వావలంబన భారత్ విజన్‌ను నిర్దేశించుకున్నామన్నారు. అధికారంలో ఉన్నా, లేకున్నా దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని ఆయన చెప్పారు.

News September 23, 2025

సెప్టెంబర్ 23: చరిత్రలో ఈరోజు

image

1976: దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ జననం
1985: క్రికెటర్ అంబటి రాయుడు జననం
1993: నటి షాలిని పాండే జననం
1996: నటి సిల్క్ స్మిత మరణం(ఫొటో)
2019: నటుడు కోసూరి వేణుగోపాల్ మరణం
✤అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం