News September 1, 2025

రాష్ట్రంలో 63.61 లక్షల మందికి పెన్షన్ల పంపిణీ: CM

image

AP: రాజంపేట నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు ఆయన పెన్షన్లు పంపిణీ చేశారు. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో.. లేదో స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 63,61,380 మంది పెన్షనర్ల కోసం రూ.2,746.52 కోట్లు విడుదల చేశారు. కొత్తగా 7,872 మందికి నెలకు రూ.4 వేలు చొప్పున స్పౌజ్ పెన్షన్లు మంజూరు చేశారు.

Similar News

News September 1, 2025

KTR సంచలన ట్వీట్

image

TG: కవిత వ్యాఖ్యలకు కౌంటర్‌గా BRS <<17583241>>పోస్ట్<<>> చేసిన హరీశ్ రావు వీడియోను KTR రీట్వీట్ చేశారు. ‘ఇది మా డైనమిక్ లీడర్ హరీశ్ రావు ఇచ్చిన మాస్టర్ క్లాస్’ అని క్యాప్షన్ ఇచ్చారు. అలాగే ‘KCR ప్రియశిష్యుడి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇరిగేషన్ గురించి ఎంతో నేర్చుకుని ఉంటారని ఆశిస్తున్నా’ అని కొనియాడారు. హరీశ్‌పై కవిత కామెంట్స్‌ నేపథ్యంలో కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

News September 1, 2025

YCP నేతలు చీరలు కట్టుకుని బస్సులు ఎక్కాలి: అచ్చెన్న

image

AP: మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతోందో లేదో తెలియాలంటే YCP నేతలు చీరలు ధరించి బస్సులు ఎక్కితే తెలుస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు సెటైర్లు వేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను TDP నిలబెట్టుకుందని చెప్పారు. ‘అధికారంలో ఉన్నప్పుడు YCP నేతలు ప్రజా సమస్యలు పట్టించుకోలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం విమర్శలు చేస్తున్నారు. మా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తోంది. సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చాం’ అని ఆయన తెలిపారు.

News September 1, 2025

USతో భారత్‌ ఏకపక్ష వాణిజ్యం చేస్తోంది: ట్రంప్

image

భారత్ దశాబ్దాలుగా USతో ఏకపక్షంగా భారీ వాణిజ్యం చేస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. ‘ఇండియా తన వస్తువులను USకు భారీ స్థాయిలో విక్రయిస్తోంది. అమెరికానే ఆ దేశానికి అతిపెద్ద కొనుగోలుదారు. US మాత్రం ఇండియాలో అధిక టారిఫ్స్‌తో తక్కువ బిజినెస్‌కే పరిమితమైంది. ఇప్పుడు సుంకాలు తగ్గిస్తామని భారత్ చెప్పినా సమయం దాటిపోయింది. అటు రష్యా నుంచి ఆయిల్ కొంటూ మమ్మల్ని టారిఫ్స్ తగ్గించమనడంలోనూ ఉపయోగం లేదు’ అని అన్నారు.