News September 1, 2025

అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా: సుదర్శన్ రెడ్డి

image

రాజ్యాంగాన్ని కాపాడటం కోసమే తాను వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ‘రాజకీయం అనే ముళ్ల కిరీటాన్ని ఎందుకు నెత్తిన పెట్టుకున్నారని చాలా మంది నన్ను అడిగారు. నేను రాజకీయాల్లోకి రాలేదు. ఏ పార్టీలో సభ్యత్వం లేదు. ఇక ముందూ ఉండదు. పౌరహక్కులు, సామాజిక న్యాయం గురించి పోరాడుతా. నేను ప్రతిపక్షాల అభ్యర్థిని’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News September 4, 2025

యూరియా లభ్యతపై మంత్రి లోకేశ్ ఆరా

image

AP: రైతుల ముసుగులో YCP చేస్తున్న కుతంత్రాలను తిప్పికొట్టాలని మంత్రులకు లోకేశ్ దిశానిర్దేశం చేశారు. క్యాబినెట్‌‌కి ముందు మంత్రులతో అల్పాహార భేటీలో పాల్గొన్నారు. జిల్లాల్లో యూరియా సమస్య ఉందా అని ఆరా తీశారు. తగినంత యూరియా ఉందని మంత్రులు తెలిపారు. తెలంగాణ రాజకీయాలపైనా మంత్రుల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇన్‌ఛార్జి మంత్రులు సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌లు నిర్వహించాలని లోకేశ్ సూచించారు.

News September 4, 2025

రేపు రేషన్ షాపులు బంద్: డీలర్ల సంక్షేమ సంఘం

image

TG: ఈ నెల 5న రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల బంద్‌కు తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం పిలుపునిచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.5వేల గౌరవ వేతనం చెల్లించాలని, అలాగే కమీషన్ పెంచాలని డీలర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. 5 నెలల కేంద్ర కమీషన్ వెంటనే విడుదల చేయాలని, అలాగే ఇక నుంచి రాష్ట్ర కమీషన్, కేంద్ర కమీషన్ వేర్వేరుగా కాకుండా ఒకేసారి చెల్లించాలని కోరుతున్నారు.

News September 4, 2025

కిమ్ జోంగ్ ఉన్ వారసురాలు ఈమేనా?

image

ఉ.కొరియా సుప్రీమ్ లీడర్ కిమ్ జోంగ్ ఉన్ తర్వాత ఆ దేశాన్ని ఆయన చిన్న కూతురు ‘కిమ్ జూ ఏ’ పాలించే అవకాశముందని ద.కొరియా నిఘా సంస్థ పేర్కొంది. గత మూడేళ్లుగా ఆమె కిమ్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. వయసు 10yrs ఉంటుందని, స్కూల్లో చేరకుండా ఇంట్లోనే చదువుతోందని, గుర్రపు స్వారీ, ఈత, స్కీయింగ్‌లో నైపుణ్యం కలిగి ఉందని సమాచారం. ఆమెకు ఓ సోదరుడు, ఒక సోదరి ఉన్నట్లు టాక్.