News September 1, 2025

కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

image

తెలంగాణలో సాయంత్రం 4 గంటలలోపు చాలా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, హన్మకొండ, హైదరాబాద్, భూపాలపల్లి, జనగాం, కరీంనగర్, కొమురంభీమ్, ఆసిఫాబాద్, మేడ్చల్, MBNR, నిర్మల్, యాదాద్రి, VKB, RR, పెద్దపల్లి, ములుగు, మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి వాతావరణం కూల్‌గా ఉంది.

Similar News

News February 17, 2026

కుక్కలా నడుస్తుంది.. ఇంజినీర్‌లా ఆలోచిస్తుంది..

image

ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో రోబో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. TCS అభివృద్ధి చేసిన ఈ రోబో కుక్కలా నడుస్తుంది. ఇంజినీర్‌లా ఆలోచిస్తుంది. రిస్కీ ప్రాంతాల్లో ప్రమాదాలు, తప్పిదాలను నివారించడమే ఈ ఆవిష్కరణ ఉద్దేశమని కంపెనీ చెబుతోంది. కంప్రెసర్లు, ఎలక్ట్రికల్ ప్యానల్స్, పవర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో సమస్యలను, గ్యాస్ లీకేజ్, వెల్డింగ్ లోపాలనూ గుర్తించగలదు. కష్టతరమైన జోన్లలోనూ పని చేస్తుందట.

News February 17, 2026

శుక్ర మౌఢ్యమి ముగుస్తోంది కానీ!

image

ఈరోజుతో శుక్ర మౌఢ్యమి ముగియడంతో శుభకార్యాలు మొదలవనున్నాయి. అయితే ఈ మంచి రోజులు మే 9 వరకు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత మే 17 నుంచి జూన్ 15 వరకు అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. ఈ కాలంలో శుభకార్యాలు చేయడం నిషిద్ధం. అలాగే మే 4 నుంచి 29 వరకు కర్తరీ దోషం ఉంది. ఈ సమయంలోనూ శుభకార్యాలు చేయరు. దీంతో మే నెలలో గృహారంభం, గృహప్రవేశం వంటి పనులు చేయరాదు. కాబట్టి ఈ లోపు మీ పనులు ప్లాన్ చేసుకోవడం శ్రేయస్కరం.

News February 17, 2026

రికార్డు సృష్టించిన శ్రీలంక, ఆస్ట్రేలియా మ్యాచ్‌

image

T20 WCలో భాగంగా శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ రికార్డు సృష్టించింది. హాట్‌స్టార్‌లో 10 కోట్ల మంది ప్రత్యక్షంగా వీక్షించారు. దీంతో ఈ టోర్నీలో 100 మిలియన్ల వ్యూయర్‌షిప్ సాధించిన తొలి నాన్ ఇండియా మ్యాచ్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 181 పరుగుల <<19162360>>లక్ష్యాన్ని<<>> 2 వికెట్లు కోల్పోయి 18 ఓవర్లలోనే శ్రీలంక ఛేదించింది. T20 WCలో ఆ జట్టుకు ఇదే హయ్యెస్ట్ ఛేజింగ్.