News September 1, 2025
వినాయకుడి స్త్రీ రూపం గురించి తెలుసా?

వినాయక నవరాత్రుల వేళ ‘విఘ్నేశ్వరి’ అమ్మవారి గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. గణేశుడి అరుదైన స్త్రీ రూపమే ఈ గణేశ్వరి అమ్మవారు. ఆమె 64 యోగినిలలో(శక్తివంతమైన దేవతల సమూహం) ఒకరిగా చెబుతుంటారు. గణేశుడు విఘ్నాలను తొలగిస్తే.. అడ్డంకులను తొలగించే శక్తిగా గణేశ్వరిని పూజిస్తారు. TNలోని శుచీంద్రంలో గణనాథుడిని గణేశ్వరిగా చూడొచ్చు. మదురై మీనాక్షి ఆలయంలోనూ వ్యాఘ్రపాద వినాయకిని దర్శించుకోవచ్చు.
Similar News
News February 6, 2026
ఆఫీస్ స్పేస్‌కు పెరుగుతున్న డిమాండ్

TG: హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరం చివరికి కొత్తగా దాదాపు 19 మిలియన్ చదరపు అడుగుల గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వస్తుందని ఇక్రా నివేదిక తెలిపింది. వీటిలో పావు వంతు వాటికి ఇప్పటికే లీజ్ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించింది. IT, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల నుంచి డిమాండ్ ఉంది. లీజు ధరలు ఏడాదికి 3-4% పెరుగుతూ వస్తున్నాయి.
News February 6, 2026
ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. హేజిల్‌వుడ్ దూరం

ఆస్ట్రేలియా పేసర్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా T20 WC మొత్తానికి దూరమయ్యారు. ఆయనకు రీప్లేస్‌మెంట్‌ను త్వరలో ప్రకటిస్తామని క్రికెట్ AUS తెలిపింది. కాగా ఇప్పటికే కమిన్స్ గాయం కారణంగా దూరం కాగా, స్టార్క్ రిటైరయ్యారు. వీరు లేకుండానే AUS ఆడబోతోంది.
టీమ్: మార్ష్, బార్ట్‌లెట్, కొన్నోలీ, T డేవిడ్, డ్వార్షుయిస్, గ్రీన్, ఎల్లిస్, హెడ్, ఇంగ్లిస్, కుహ్నెమాన్, మాక్స్‌వెల్, రెన్షా, స్టోయినిస్, జంపా. రిజర్వ్: అబాట్
News February 6, 2026
రేపటి నుంచే వాలెంటైన్స్ వీక్

ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే వాలెంటైన్స్ వీక్ రేపటి నుంచే ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 7న ‘రోజ్ డే’తో మొదలై వారం రోజుల పాటు ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే వంటి ప్రత్యేక రోజులతో ఈ వేడుకలు కొనసాగుతాయి. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేతో ఇవి ముగుస్తాయి. ఈ వీక్ అంతా ప్రేమికులు తమ మనసులోని ఇష్టాన్ని వ్యక్తపరచడానికి, గిఫ్టులు ఇచ్చిపుచ్చుకుంటూ ప్రేమను చాటుకుంటారు.


