News April 3, 2024
ఉగ్రదాడి సూత్రదారులందర్నీ పట్టుకుంటాం: పుతిన్

మాస్కోలో ఉగ్రదాడి ఘటనతో భారీ మూల్యం చెల్లించుకున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఈ వ్యవహారం వెనుక ఉన్న సూత్రధారులందర్నీ పట్టుకుంటామని చెప్పారు. దేశాన్ని విచ్చిన్నం చేసేలా ప్రజల్లో భయాందోళనలు, కలహాలు, ద్వేషాన్ని నాటేందుకు కొందరు యత్నించారని.. అటువంటి వాటిని అనుమతించకూడదని వ్యాఖ్యానించారు. కాగా ఇటీవల రాజధాని మాస్కోలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 140 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.
Similar News
News March 19, 2026
‘పుష్ప-2’ రికార్డు బద్దలైంది!

‘ధురంధర్-2’ భారత సినిమా రికార్డులను తిరగరాస్తోంది. ‘బుక్ మై షో’లో ఒక్క గంటలోనే రికార్డు స్థాయిలో 1.09 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. గతంలో ఈ రికార్డు పుష్ప-2 (1.07 లక్షలు) పేరిట ఉండేది. వీకెండ్స్‌లో ఈ మూవీ టికెట్ సేల్స్ మరింతగా పెరుగుతాయని, భారీ కలెక్షన్లు పక్కా అని నెటిజన్లు అంటున్నారు. కాగా గతేడాది వచ్చిన ధురంధర్ దాదాపు రూ.1,350 కోట్లు వసూలు చేసింది.
News March 19, 2026
పంచాంగ పఠనం.. రాష్ట్రానికి ఆర్థిక ప్రగతి ఉంటుందన్న మాడుగుల

AP: ప్రభుత్వం విజయవాడలో నిర్వహించిన ఉగాది సంబరాల్లో మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ పఠనం చేశారు. పరాభవ నామ సంవత్సరంలో ప్రభుత్వానికి విజయం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. లగ్నాల ప్రకారం ఈ ఏడాది వర్షపాతం బాగానే ఉంటుందని.. ఉగాదికి ముందుగానే కురిసిన వర్షం దీనికి సూచిక అని తెలిపారు. అమరావతి విశ్వనగరిగా ఎదుగుతుందని.. రాష్ట్రానికి ఆర్థిక ప్రగతి ఉంటుందని చెప్పారు. ప్రజలు సుఖ శాంతులతో ఉంటారని వివరించారు.
News March 19, 2026
PNG.. జిల్లాల వారీగా ఈ కంపెనీల సర్వీసులు

ఏపీలోని అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో THINK GAS అనే కంపెనీ PNG సర్వీసును అందిస్తోంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో IOCL, ఉభయగోదావరిలో గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్, విజయవాడ, కాకినాడలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్(BGL), కృష్ణాలో మెగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు సేవలు అందిస్తున్నాయి. HYDలో BGL, పలు జిల్లాల్లో IOCL సర్వీసులు ఉన్నాయి.


