News September 1, 2025
3 రోజుల ఏసీబీ కస్టడీకి ఐపీఎస్ సంజయ్

AP: నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే <<17552037>>కేసులో<<>> సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్‌ను ఏసీబీ విచారించనుంది. వారం రోజులు విచారణకు అనుమతివ్వాలన్న పిటిషన్‌పై విచారించిన ఏసీబీ కోర్టు 3 రోజుల పాటు ఆయనను కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రేపట్నుంచి అధికారులు ఆయనను ప్రశ్నించనున్నారు. ఉ.8- సా.6 గంటల వరకు ప్రశ్నించేందుకు కోర్టు అనుమతించింది.
Similar News
News September 6, 2025
చరిత్ర సృష్టించిన సికందర్ రజా

జింబాబ్వే క్రికెటర్ సికందర్ రజా సరికొత్త చరిత్ర సృష్టించారు. టీ20 ఫార్మాట్(టెస్టులు ఆడే దేశాలు)లో అత్యధిక POTMలు అందుకున్న ప్లేయర్‌గా రజా నిలిచారు. ఇప్పటివరకు ఆయన 18 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నారు. శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో ఆయన POTMగా నిలిచి ఈ ఫీట్ సాధించారు. రజా తర్వాత కోహ్లీ, సూర్యకుమార్(16), మహమ్మద్ నబీ, రోహిత్(14), మహ్మద్ రిజ్వాన్, వార్నర్, మ్యాక్స్‌వెల్ (12) ఉన్నారు.
News September 6, 2025
SBIలో 6,589 జాబ్స్.. పరీక్షల తేదీ ప్రకటన

6,589 క్లర్క్(జూనియర్ అసోసియేట్స్) పోస్టుల భర్తీకి ఈనెల 20, 21, 27 తేదీల్లో ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్లు SBI ప్రకటించింది. త్వరలో కాల్ లెటర్లు విడుదల చేయనున్నట్లు తెలిపింది. కాగా AUG 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించింది. మొత్తం పోస్టుల్లో 5,180 రెగ్యులర్, 1,409 బ్యాక్‌లాగ్ ఉద్యోగాలున్నాయి. వీటిలో APలో 310, TGలో 250 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
వెబ్‌సైట్: <
News September 6, 2025
అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

APలో LAWCET, PGLCET, EdCET, PECETలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. LAWCET, PGLCETకు ఈనెల 8-11 మధ్య దరఖాస్తు ఫీజు చెల్లించాలి. 12-14 మధ్య వెబ్ ఆప్షన్స్, 17న సీట్ల కేటాయింపు చేపడతారు. EdCETకు 9-12 మధ్య ఫీజు చెల్లింపు, 13-15 మధ్య వెబ్ ఆప్షన్స్, 18న సీట్ అలాట్‌మెంట్ ఉంటుంది. PECETకు 10-13 మధ్య ఫీజు చెల్లింపు, 14-16 మధ్య వెబ్ ఆప్షన్స్, 19న సీట్ల కేటాయింపు ఉంటుంది. పూర్తి వివరాలకు <