News September 1, 2025

భీమవరం: పీజీఆర్ఎస్‌కు 210 అర్జీలు

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రజల నుంచి 210 అర్జీలను స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ పరిధిలో లేని అర్జీలను సైతం సంబంధిత శాఖలకు పంపించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

Similar News

News September 3, 2025

జల జీవన్ మిషన్ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు: కలెక్టర్

image

స్వచ్ఛ భారత్ మిషన్, జల జీవన్ మిషన్ అమలుపై బుధవారం ఢిల్లీ నుంచి డిపార్ట్‌మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ సెక్రటరీ 13 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భీమవరంలో కలెక్టర్ నాగరాణి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. జిల్లాలో జల జీవన్ మిషన్ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిబ్బంది పాల్గొన్నారు.

News September 3, 2025

భీమవరం: ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

image

రైతులను మోసం చేసేందుకు కృత్రిమంగా ఎరువుల కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి హెచ్చరించారు. అటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. పౌరసరఫరాల, పోలీస్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి అధిక ధరలకు అమ్మే దుకాణాలను సీజ్ చేయాలని ఆదేశించారు.

News September 3, 2025

భీమవరం: అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

image

జిల్లాలో వర్క్ ఫ్రం హోం సర్వే, పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్, వాహనాల ఆధార్ సీడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో వాహనాల ఆధార్ సీడింగ్, తల్లికి వందనం, వర్క్ ఫ్రం హోం, ఈ-కేవైసీ వంటి అంశాలపై ఆమె చర్చించారు. ‘తల్లికి వందనం’ పథకంలో నగదు జమలో ఉన్న అడ్డంకులను వెంటనే పరిష్కరించాలని సూచించారు.