News September 1, 2025
ప్రభాస్‌తో సినిమా కోసం అనుష్క వెయిటింగ్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో మరో సినిమా చేయాలని హీరోయిన్ అనుష్క శెట్టి భావిస్తున్నట్లు తెలుస్తోంది. బాహుబలి తర్వాత అదే రేంజ్‌లో ఉండే కథ వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కచ్చితంగా డార్లింగ్‌తో మళ్లీ కలిసి నటించే రోజు వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా అనుష్క నటించిన ‘ఘాటీ’ మూవీ ఈ నెల 5న థియేటర్లలో విడుదల కానుంది.
Similar News
News September 7, 2025
తాజా సినీ ముచ్చట్లు

☛ రాజమౌళి డైరెక్షన్‌లో చేస్తున్న సినిమాలో మహేశ్ బాబు కొన్ని సన్నివేశాల్లో రాముడి గెటప్‌లో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
☛ రేపు (సోమవారం) వైజాగ్‌లోని గోకుల్ పార్క్‌లో ‘మిరాయ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఈనెల 12న సినిమా విడుదల
☛ ‘మిరాయ్’కు సీక్వెల్ తీసే స్కోప్ ఉంది. సినిమా హిట్ అయితే సీక్వెల్ గురించి ఆలోచిస్తాం: డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని
News September 7, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News September 7, 2025
సెప్టెంబర్ 7: చరిత్రలో ఈరోజు

1925: సినీ నటి భానుమతి జననం (ఫొటోలో ఎడమవైపు)
1951: నటుడు మమ్ముట్టి జననం (ఫొటోలో కుడివైపు)
1976: సంగీత దర్శకుడు భీమవరపు నరసింహారావు మరణం
1983: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల జననం
1986: సినీ నిర్మాత, దర్శకుడు పి.ఎస్.రామకృష్ణారావు మరణం
1991: తెలంగాణ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి మరణం