News September 1, 2025

ADB: వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై సమీక్ష

image

వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ సమీక్ష నిర్వహించారు. సంబంధిత శాఖలన్నీ సమగ్ర సమన్వయంతో ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులు ఆదేశించారు. ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రోడ్ల మరమ్మతులు, శోభాయాత్రకు అడ్డంకిగా ఉండే చెట్ల కొమ్మలను తొలగించనున్నట్లు చెప్పారు.

Similar News

News September 3, 2025

ADB: 3 రోజులు వైన్స్ బంద్

image

ADB అబ్కారీ సర్కిల్ పరిధిలో గణేశ్ నిమజ్జనం దృష్ట్యా 3 రోజులు మద్యం దుకాణాలు బంద్ పాటించాలని ఎక్సైజ్ విజేందర్ పేర్కొన్నారు. ఈనెల 3వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 10 గంటల వరకు తాంసి, భీంపూర్, జైనథ్, మావల, ఆదిలాబాద్, అదేవిధంగా ఈనెల 5వ తేదీ సాయంత్రం 6 నుంచి 7వ తేదీ ఉదయం 10 వరకు బేల, తలమడుగు, జైనథ్, మావల, ఆదిలాబాద్‌లోని వైన్స్, బార్ షాపులు, కల్లు దుకాణాలను మూసి ఉంచాలని సూచించారు.

News September 3, 2025

ADB: ఈ నెలంతా 30 పోలీస్ యాక్ట్ అమలు

image

జిల్లాలో సెప్టెంబర్ నెలాఖరు వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఎటువంటి కార్యక్రమాలు, సమావేశాలు ఏర్పాటు చేయాలన్న ముందస్తుగా పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు అన్నారు.

News September 2, 2025

ADB: ఈనెల 6న ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా పోటీలు

image

ADB: జిల్లా కేంద్రంలోని ఐపీ స్టేడియంలో ఈనెల 6వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు డీవైఎస్ఓ శ్రీనివాస్ తెలిపారు. క్రీడల్లో పాల్గొనాలనుకునే ఉద్యోగులు ఈనెల 4వ తేదీన సాయంత్రం 5 గంటల్లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9440765485, 9494956454 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.