News April 3, 2024
12 ఏళ్ల బాలికను పెళ్లాడిన 63 ఏళ్ల వృద్ధుడు

పశ్చిమ ఆఫ్రికాలోని ఘనాలో దారుణం చోటుచేసుకుంది. 12 ఏళ్ల బాలికను 63 ఏళ్ల వృద్ధుడు వివాహం చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 30న వీరి వివాహం జరగగా అభం శుభం తెలియని బాలికను పెళ్లి చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. అయితే కన్యను పెళ్లి చేసుకోవాలనే పాత ఆచారం ప్రకారం వివాహం జరిగిందని ఈ వేడుకకు హాజరైన ఓ అతిథి వివరించాడు. ఈ ప్రాంతంలో ఈ విధానం సర్వసాధారణమని చెప్పడం గమనార్హం.
Similar News
News November 7, 2025
తరచూ ఛాతి ఎక్స్‌రేలు తీయించుకుంటున్నారా?

చాలామంది వార్షిక హెల్త్ చెకప్స్‌లో రక్త పరీక్షలతో పాటు ఎక్స్‌రేలు చేయించుకుంటారు. అయితే ఆరోగ్యంగా ఉండి, ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేని వ్యక్తులు చెస్ట్ ఎక్స్-రేలు తీసుకోనక్కర్లేదని వైద్యులు సూచిస్తున్నారు. ‘ఎక్స్-రేలు తరచూ తీయించుకుంటే రేడియేషన్‌కు గురవుతారు. ఇది దీర్ఘకాలంలో సమస్యలకు దారితీయవచ్చు. దగ్గు, జ్వరం, టీబీ వంటి అనారోగ్యం బారిన పడినవారు వైద్యుల సూచనతో తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.
News November 7, 2025
వేమూరి వినోద్ అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

AP: కర్నూలు బస్సు <<18110276>>ప్రమాద ఘటన<<>>లో వి.కావేరి ట్రావెల్స్ యజమాని, A2 వేమూరి వినోద్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ వెల్లడించారు. కర్నూలు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. OCT 28న A1 డ్రైవర్ లక్ష్మణ్‌ను అరెస్టు చేశారు. గత నెల జరిగిన ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే.
News November 7, 2025
భారత్ స్వర్గధామంలాంటి ఆశ్రయం ఇచ్చింది: హసీనా

బంగ్లాదేశ్‌లోని యూనస్ ప్రభుత్వంలో తీవ్రవాదులకు మద్దతునివ్వడం వల్ల ఇండియాతో సంబంధాలు దెబ్బతింటాయని ఆదేశ ex-PM షేక్ హసీనా అన్నారు. అవామీ లీగ్‌పై నిషేధంతో తన మద్దతుదారులు రానున్న ఎలక్షన్లో పాల్గొనే అవకాశం లేదని చెప్పారు. మైనారిటీలు దాడులకు గురవుతున్నారన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై కోర్టుకు ఆధారాలు సమర్పిస్తానన్నారు. భారత్ తనకు స్వర్గధామంలాంటి ఆశ్రయాన్ని కల్పించిందని ప్రశంసించారు.


