News September 1, 2025
HYD: NAARM ఏర్పాటై నేటికి 50 ఏళ్లు..!

వ్యవసాయ రంగంలో కీలక పరిశోధనలకు నిలయమైన NAARM (నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్) నగరంలో ఏర్పాటై ఈరోజుకు 50 ఏళ్లయింది. రాజేంద్రనగర్‌లో 1976 సెప్టెంబర్ 1న నార్మ్ ఏర్పాటు చేశారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో నార్మ్ శాస్త్రవేత్తలకు శిక్షణ కూడా ఇస్తోంది. అగ్రికల్చర్‌కు NAARM ఒక దిక్సూచి అని ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ గోపాల్‌లాల్ పేర్కొన్నారు.
Similar News
News September 5, 2025
HYD: నేడు, రేపు WINES బంద్

రేపు గణపతి నిమజ్జనాల నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్లు, బార్& రెస్టారెంట్లు ఇవాళ సా.6 నుంచి రేపు సా.6 గంటల వరకు మూసేయాలని CP సుధీర్ బాబు తెలిపారు. సైబరాబాద్ పరిధిలో వైన్సు, బార్‌లు, కల్లుకాంపౌండ్‌లు బార్& రెస్టారెంట్లు రేపు ఉ.6 గం. నుంచి ఆదివారం ఉ.6 గం.కు బంద్ చేయాలని సీపీ అవినాష్ మహంతి తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు.
News September 5, 2025
ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రం అగ్నిగుండమే: ఆర్.కృష్ణయ్య

తెలంగాణలో 14 లక్షల మంది కళాశాల విద్యార్థుల ఫీజు బకాయిలు రూ.6 వేల కోట్లు వారం రోజుల్లోగా చెల్లించకపోతే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఫీజు బకాయిలపై వెంటనే ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతూ ఆయన గురువారం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలన్నారు.
News September 5, 2025
పెరిగిన బిజినెస్.. GHMCకి భారీ ఆదాయం

మహానగరంలో స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. ఇళ్లు, స్థలాలు ఈ సంవత్సరం అధికంగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో భవన నిర్మాణ అనుమతుల ద్వారా GHMCకి కోట్ల రూపాయల్లో ఆదాయం వస్తోంది. గతేడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు GHMCకి రూ.399 కోట్ల ఆదాయం రాగా.. ఈ సంవత్సరం అవే నెలలకు సంబంధించి రూ.759.98 కోట్లు వచ్చింది. అంటే దాదాపు డబుల్ ప్రాఫిట్ వచ్చిందన్నమాట. స్థిరాస్తి వ్యాపారం పెరుగుతోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం.